Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
ప్రెగ్నన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే రెండు నెలలు ఇలా చేయండి, కచ్చితంగా తల్లవుతారు!
పెళ్లయిన ప్రతీ అమ్మాయి తల్లి కావాలని కోరుకుంటుంది. అందుకోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమంది అందులో విఫలం అవుతుంటారు. ఎన్ని రకాలుగా, ఎన్ని సార్లు ప్రయత్నించినా గర్భం పొందరు. అయితే ఇందుకు చాలానే కారణాలు ఉన్నాయి.
మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలి వల్ల కూడా గర్భధారణకు సమస్యలుగా మారుతాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడి గర్భం దాల్చాలనుకుంటే రెండు నెలల పాటు ఇలా చేయాలి. దీనివల్ల కచ్చితంగా మీరు గర్భం దాల్చుతారు.

మీరు తల్లి అవ్వాలనుకుంటే ముందుగా మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి. మీరు బాగుంటేనే పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుంది. మీరు గర్భం దాల్చాలనుకుంటే ముందుగా మీరు ఓ మంచి గైనకాలజిస్టును కలవండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మీ జీవనశైలి గురించి కూడా చర్చించండి. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటున్నట్లుగా చెప్తే కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.
అండం విడుదలను గమనించడం..!
ముందుగా మీలో అండం ఎప్పుడు విడుదల అవుతుందో గమనించాలి. అండోత్సర్గం సరిగ్గా జరిగితేనే గర్భం త్వరగా వస్తుంది. లేదంటే చాలా ఆలస్యం అవుతుంది. తల్లి కావాలనుకుంటే మీ రుతు చక్రం గురించి బాగా తెలుసుకోవాలి. ప్రతీ నెలా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్ని చేయాలి. అండం రిలీజ్ అయినట్లు ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నారా...!
అండం విడుదలైనట్లు తెలుసుకోవడం ఎలా:
అండం విడుదల గురించి తెలుసుకోవడం చాలా సులువు. ప్రతీ రోజు ఉదయం మీ ఉష్ణోగ్రతను తెలుసుకోవడం ద్వారా అండోత్సర్గాన్ని టాక్ చేయొచ్చు. నెలంతా నార్మల్ గా ఉండి ఓరోజు ఉష్ణోగ్రత పెరిగిందంటే ఆరోజు అండం విడుదల అయినట్లు. ఇది కాస్త కష్టంగా అనిపిస్తే అండోత్సర్గం ప్రిడిక్షన్ కిట్ వంటి అండోత్సర్గ పరీక్షలతో ఎగ్ రిలీజ్ ను గుర్తించవచ్చు. ఆ సమయంలోనే మీరు భాగస్వామితో కలయికలో పాల్గొనాలి. దీని వల్ల త్వరగా తల్లయ్యే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి:
అలాగే గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా చెడు అలవాట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మద్యం, ధూమపానం మరియు ఇతర మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.
దీని ద్వారా మీ ఆరోగ్యాన్ని కొంత వరకు కాపాడుకోవచ్చు. అంతే కాకుండా ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవలి. రకరకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది.
సమతుల్య ఆహారం తీసుకోవాలి:
సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన గర్భధారణకు చాలా సహాయ పడుతుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామం గర్భధారణకు మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో నార్మల్ డెలవరీ అయ్యేందుకు బాగా ఉపయోగపడుతుంది.
అధిక బరువు వల్ల గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది అండోత్సర్గానికి ఆటంకం కలిగిస్తుంది. బరువు తక్కువగా ఉండటం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే మంచి ఆహారం, అద్భుతమైన వ్యాయామం ఆరోగ్యకరమైన గర్భధారణకు చాలా ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications
