Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
ఎండాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా పెంచవచ్చు, ఒక్క రోగం కూడా రాదు!
సాధారణంగా మన ఇంట్లోని పిల్లలు చాలా తొందరగా రోగాల బారిన పడుతుంటారు. వారిలో రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉండడం, దుమ్ము ధూళి, మురికిలో ఆదుకోవడం వంటి వాటి వలన వారు తొందరగా జబ్బు చేస్తారు. దీని కారణంగా వారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే డబ్బు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పిల్లల రోగ నిరోధక శక్తి అనేది మంచి స్థాయిలో అనడంతో పాటు, ఆరోగ్యంగా ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. రోగ నిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలను తమకు తామే రక్షించుకోగలరు.
అయితే పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. వారికి మంచి పోషకాలు కలిగిన ఆహరం ఇవ్వడం, సరైన నిద్ర అందించడం, వ్యాయామం చూపించడం, జీవన శైలిలో మార్పు తీసుకురావడం వంటి అంశాలేన్నో ఉంటాయి. వీటిని పాటించడం వలన ఎలాంటి మందు వినియోగించకుండా సహజసిద్ధంగానే మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోగలుగుతారు. అలాగే మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారు అవుతారు. అయితే ఈ స్టోరీలో పిల్లల్లో సహజసిద్ధంగానే రోగ నిరోధక శక్తిని పెంపొందించే అంశాలు ఏంటి? వారిలో ఇమ్యూనిటీని పెంచడానికి ఏం చేయాలి అనేది తెలుసుకుందాం.

పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కీలకాంశాలు
పోషక ఆహారం
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచి, వారిని ఆరోగ్యంగా బలంగా తయారు చేయాలంటే కచ్చితంగా వారికి ఎన్నో పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. పిల్లలకు మీరిచ్చే ఆహారంలో విటమిన్ A, C, D, E ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి పిల్లల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే ఎముకలకు బలాన్ని అందిస్తాయి. దీంతో పాటు వారి చర్మ సౌందర్యానికి ఎంతో ఉపకరిస్తాయి. ఈ విటమిన్స్ తో పాటు మీరిచ్చే ఆహారంలో జింక్, ఐరన్, ఒమేగా-3 వంటి ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి. దీని వలన మీ పిల్లలు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే వారికి మీరిచ్చే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, పాలు, పెరుగు వంటి ఆహార పదార్థాలు కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ఇవి మీ పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
తగినంత నిద్ర:
ఏ మనిషి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే అతనికి కచ్చితంగా తగినంత నిద్ర కావాలి. నిద్ర సరిగ్గా సరిపోతేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఈ నిద్ర పిల్లల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు కచ్చితంగా వారికి తగినంత నిద్ర ఇవ్వాలి. ఉదాహరణకు
2-5 సంవత్సరాల పిల్లలకు రోజుకు 10-13 గంటల నిద్ర అవసరం.
6-13 సంవత్సరాల పిల్లలకు రోజుకు 9-11 గంటల నిద్ర అవసరం.
ప్రతి మనిషికి సరైన నిద్ర, శరీరాన్ని పునరుద్ధరించి, ప్రతిరక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. పిల్లల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలను ఎంత వీలైతే అంత ఎక్కువ సేపు పడుకోనివ్వాలి.
శారీరక శ్రమ: ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూస్తూ వాటికే ఎడిక్ట్ అయిపోతున్నారు. దీని వలన వారిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వారికి శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యం. పిల్లలు బయట ఆడటం, రన్నింగ్, యోగా, క్రీడలు లేదా ఇతర ఫిజికల్ యాక్టివిటీలలో పాల్గొనడం ద్వారా వారి శరీరాన్ని శక్తివంతంగా ఉంచవచ్చు. ఈ శారీరక శ్రమ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
హైడ్రేషన్: తగినంత నీరు త్రాగడం, పండ్ల రసాలు త్రాగడం ద్వారా శరీరం మంచి హైడ్రేషన్‌ని పొందుతుంది. ఈ విధంగా, శరీరంలో వ్యర్థాలు బయటపెట్టడం, చర్మ ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
మానసిక ఆరోగ్యం: పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా, మానసికంగా సరైన స్థితిలో ఉండటం వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆందోళనలు, ఒత్తిడి లేకుండా ఉన్న పిల్లలు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తారు.
శుభ్రత: క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, నెమ్మదిగా శరీర శుభ్రత పాటించడం, స్కూలుకు వెళ్లేముందు ముఖాన్ని, చేతులను శుభ్రపరిచే అలవాట్లు పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రేరేపిస్తాయి.
పిల్లల ఇమ్యూనిటీ పెంచే చిట్కాలు:
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అమ్రిత్ డియోల్ అనేక ఆరోగ్య చిట్కాలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచేందుకు సూచించారు. ఆయా చిట్కాలు:
సిట్రస్ పండ్లు తినడం: సిట్రస్ పండ్లు (జామ, నారింజ, మామిడికాయలు) విటమిన్ C అధికంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లను పిల్లలు ఎక్కువగా తినేలా చూడండి.
గోల్డెన్ మిల్క్ (పసుపు పాలు): రాత్రి పడుకునే ముందు గ్లాసు పసుపు కలిపిన పాలు పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి రోగనిరోధక శక్తి బలపడుతుంది.
తులసి ఆకుల నీరు: పిల్లల నీటిలో శుభ్రంగా కడిగిన తులసి ఆకులను వేసి త్రాగించడం కూడా వారి ఆరోగ్యానికి, ఇమ్యూనిటి పెంచడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
తాజా పండ్ల రసాలు: ప్యాకెట్లలో ఉన్న ప్రాసెస్ చేసిన పండ్ల రసాల బదులుగా, నేరుగా తాజా నారింజ రసం పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
తేనె మరియు పాలు: రోజూ ఉదయాన్నే స్కూలుకు వెళ్లే ముందు పిల్లలకు ఒక స్పూన్ తేనెను పాలు కలిపి ఇవ్వడం ద్వారా వారి శరీరంలో పోషకాలు సరిగ్గా శోషించబడతాయి, మరియు వారి ఇమ్యూనిటీ బలపడుతుంది.
పిల్లల డైట్ మార్చడం:
పిల్లల పోషకాహారానికి సంబంధించిన డైట్ క్రమం తప్పకుండా మార్పులు చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా పిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ పిల్లల ఆహారాన్ని, జీవనశైలిని నడిపించడానికి ఇవి మీకు సహాయపడతాయి. ఈ చిట్కాలను పాటించడం ప్రారంభిస్తే, మీ పిల్లలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడమే కాదు, వారి శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. మొదటి అడుగు తీసుకోండి, ఇంకా ఆరోగ్యాన్ని పెంచండి!



Click it and Unblock the Notifications











