Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లలకు హోమ్ వర్క్ షెడ్యూల్ ఇలా ప్లాన్ చేసుకుంటే.. క్లాస్‌లో వారే టాపర్! అస్సలు తిరుగుండదు
ప్రస్తుత కాలంలో పిల్లల గురించి దగ్గరుండి పట్టించుకునే తల్లిదండ్రులు తక్కువైపోయారు. వారికోసం ఒక కేర్ టేకర్ లేదా ట్యూషన్ మాస్టర్‌ను పెట్టేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లల్లో నైపుణ్యత తగ్గిపోతుంది. హోమ్ వర్క్ చేయడం వంటివి మానేస్తున్నారు. తమ పిల్లలను తాము బాగానే చూసుకుంటున్నాం, బాగానే చదివిస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ పిల్లలు తాము అనుకుంటున్న విధంగా చదవరు.
అందుకే వారికోసం ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేయించుకునేందుకు ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఆ సమయంలో హోమ్ వర్క్ చేయడం వల్ల వారిలో నైపుణ్యత పెరగడంతో పాటు.. వారిలో తెలివితేటలు ఇంప్రూవ్ అవుతాయి. అసలు ఏ సమయంలో పిల్లలతో హోమ్ వర్క్ చేయిస్తే మంచిది? వారి హోమ్ వర్క్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్కూల్ నుంచి రాగానే
పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోమ్ వర్క్ చేపించడం మంచి పద్దతిగా చెప్పుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే పిల్లల చేత హోమ్ వర్క్ చేయించడం వలన వారు స్కూల్‌లో చదివింది గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరి సహాయం లేకుండా వారి హోమ్ వర్క్ వారే చేసుకునే ఛాన్సుంటుంది. అందుకే వారికి స్కూల్ నుంచి రాగానే హోమ్ వర్క్ చేయించడం మంచిది.
స్నాక్స్ తరువాత..
కొన్నికొన్ని సార్లు స్కూల్ నుంచి రాగానే హోమ్ వర్క్ చేయించడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జర్నీ చేసి వస్తారు కాబట్టి మైండ్ అంత చురుగ్గా ఉండదు. అందుకే సాయంత్రం స్నాక్స్ తరువాత హోమ్ వర్క్ చేయించడం కూడా మంచిది. వారికి తగిన శక్తి లభించడంతో పాటు వారి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో హోమ్ వర్క్ చేయించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి.
ఉదయం సమయంలో..
ఉదయాన్నే ఎవరి మైండ్ అయినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువగా పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వారిలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలోనే హోమ్ వర్క్ చేయించడం మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. సెలవుల్లో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో హోమ్ వర్క్ చేయించడం చాలా గొప్ప విషయం.
ఎప్పుడు చేయించకూడదు అంటే..
కొన్ని కొన్ని సమయాల్లో పిల్లల చేత అస్సలు హోమ్ వర్క్ చేయించడకూడదు. అవి ఏంటంటే.. మధ్యాహ్నం లంచ్ తరువాత పిల్లల చేత ఎట్టి పరిస్థితుల్లోనూ హోమ్ వర్క్ చేయించకూడదు. ఆ సమయంలో పిల్లలు అలసిపోయి ఉంటారు. పైగా తినేస్తారు కాబట్టి వారికి నిద్రవస్తుంది. ఆ సమయంలో హోమ్ చేయించడం వృథా అయిపోతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా హోమ్ వర్క్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించకూడదు. ఆ సమయంలో వారి మైండ్ స్లీపింగ్ మోడ్‌లో ఉంటుంది. అందుకే పడుకునే ముందు అస్సలు హోమ్ వర్క్ ఊసే ఎత్తకూడదు.



Click it and Unblock the Notifications