Latest Updates
-
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.!
నార్మల్ డెలివరీ కావాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
బిడ్డని కనడం ఒక తల్లికి చాలా పెద్ద ఛాలెంజ్.బిడ్డను కనీ సమయంలో ప్రాణం పోయి మళ్లీ తిరిగి వస్తుంది. కడుపులో బిడ్డను మోసి జన్మనివ్వలంటే అష్ట కష్టాలు పడుతుంది. గతంలో చాలా ఏళ్ల క్రితం పురిటి నొప్పులు భరించలేక తల్లి మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలా పురిటి నొప్పులు వల్ల తల్లికి ఇబ్బంది కలగకూడదని వైద్యులు సిజేరియన్. పద్ధతిని తీసుకొని వచ్చారు. సిజేరియన్ లో తల్లి ఎలాంటి పురిటి నొప్పులను అనుభవించదు. ఈ ప్రక్రియలో వైద్యులు ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తారు.
అయితే ప్రస్తుతం చాలామంది తల్లులు నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. నాన్ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే నార్మల్ డెలివరీకి అవకాశం ఇస్తామని అంటున్నారు. మరి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాలను మీకు తెలియజేస్తాం.

ప్రతిరోజు వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా ఉండంటున్నారు. ప్రసవం సమయంలో పురిటినొప్పులు తట్టుకోవాలంటే వ్యాయామం చేయాల్సిందే నని సూచిస్తున్నారు. గర్భినులకు ప్రత్యేకంగా ప్రీ-నాటల్ వ్యాయామాలు ఉంటాయి. వైద్యుల సంరక్షణలో మాత్రమే ఇలాంటి వ్యాయామాలు చేయాలంటున్నారు. సాధారణంగా అందరూ చేసే వ్యాయామాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. స్టామినా పెంచుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సిందేనని అంటున్నారు.
ప్రాణాయామం వ్యాయామాలు
బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామం చేయాలని సూచిస్తున్నారు. డెలివరీ సమయంలో ఊపిరి సరిగ్గా ఆడదు గాలి గట్టిగా పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి. ముక్కునుండి గాలిని గట్టిగా మళ్లీ గట్టిగా వదిలే ప్రక్రియను రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
చదవడం
డెలివరీ కి సంబంధించిన సమాచారాన్ని గర్భిణీలు తెలుసుకుంటూ ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ ఉండాలి. ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యులను అడగాలి.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యాకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మానసికంగా ఎంత బలంగా ఉన్నా శారీరకంగా బలంగా లేకపోతే నార్మల్ డెలివరీ కష్టమని వైద్యులు చెబుతున్నారు. ప్రసవం బాగా జరగాలంటే కూరగాయలు, పళ్ళు, పాలు, మాంసం పాదార్థలని రోజూ తినే ఆహారంలో చేర్చాలని వైద్యులు చెబుతున్నారు. చిరుతిల్లను అస్సలు తినవద్దని, లేదంటే బరువు పెరిగి ప్రసవంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిసున్నారు.
కంటి నిండా నాద్రపోవడం
గర్భిణులకు నార్మల్ డెలివరీ కావాలంటే కంటి నిండా నిద్ర పోవాల్సిందే. ఇది బిడ్డ ఎదుగుదలకు చాలా దోహదపడుతుంది. రోజుకు కనీసం 8 గంటల నిద్ర తల్లికి చాలా అవసరం. ఈ సమయంలో గర్భిణులకు కళ్లుతిరగడం, అలసట ఎక్కువగా వస్తుంది. కాబట్టి వారు తప్పకుండా రోజుకు 8 గంటలు నిద్రపోవాల్సిందే. మేలుకొని ఉండడం వల్ల మెదడుపై ఒత్తిడి పడుతుంది. అది బిడ్డ ఎదుగుదలకు కూడా చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చిరిస్తున్నారు.



Click it and Unblock the Notifications