Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
పసికందుల్లో దగ్గుతగ్గాలంటే ఇలా చేయండి..! జాగ్రత్తలు తప్పనిసరి...!
ప్రస్తుతం ఇన్ఫెక్షను ఎక్కువయ్యాయ్. కరోనా తరువాత అనేక కొత్త రోగాలు బయటపడ్డాయి. ఒకసారి చాలా మందికి ఒకే రకమైన వ్యాధి రావడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల్లను ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ఇబ్బంది పెడుతున్నాయ్. పసిపిల్లలకు ఆగకుండా దగ్గు వస్తే వెంటనే పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్‌ను కలవడానికి మరింత సమయం పడుతుందనుకున్నప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే పిల్లలకు ఊరట కలుగుతుంది. ఈ చిట్కాలను కూడా వైద్యులను సంప్రదించే పాటించాలి.
పసికందుల్లో దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించాలి
దగ్గు చాలా రకాలుగా వుంటుంది. పొడి దగ్గు, కఫం దగ్గు, ఇలా రకరకాలుగా వుంటాయ్. కొన్ని సందర్భాల్లో దగ్గితే రక్తం రావడం, మింగడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. పసికందులు, లేదా చిన్నారులు దగ్గినప్పుడు కఫం బయటకు వస్తుంది. వారి శరీరం హైడ్రేటెడ్‌గా వుండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే కఫం బయటకు వచ్చినా ఆరిపోకుండా వుంటుంది. లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులును ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో తల్లిపాలనివ్వడం శ్రేయస్కరం.

పసికందు ముక్కులో ఓటీసీ సెలైన్ డ్రాపులు వేయాలి. ఒక ముక్కు రంద్రంలో రెండు లేదా మూడు సెలైన్ డ్రాపులు వేయాలి.
పసికందుల ముక్కులో కఫాన్ని క్లీన్ చేస్తూ వుండాలి. దీని కోసం చిన్న సక్షన్ ట్యూబులు వుంటాయ్. ఈ సక్షన్ ట్యూబుల సాయంతో పసిపిల్లల ముక్కులో మ్యూకస్ లేకుండా చూసుకోవాలి. తరచూ సక్షన్ చేయడం వల్ల పిల్లలకు విసుగు వస్తుంది.
హ్యామిడిఫైయర్‌ను ఉపయోగించడం వల్ల పిల్లలకు వేడి గాలి వస్తుంది. ఈ వేడి గాలిని పీల్చడం వల్ల కఫం ఏదైనా వుంటే బయటకు వచ్చేస్తుంది, కరిగిపోతుంది. బాత్‌రూంలో హాట్ వాటర్ షవర్‌ని ఆన్ చేసి 10 నిమిషాలు బాత్‌రూంను క్లోస్ చేయాలి. అప్పుడు బాత్‌రూంలోపల వేడి గాలి మొత్తం నిండిపోయి వుంటుంది. బిడ్డను ఆ బాత్‌రూంలోకి తీసుకొని వెళ్లి బిడ్డ చాతిపై నిమరడం వల్ల కఫం బయటకు వస్తుంది.
బిడ్డకు 12 నెలల వయసు వుంటే లేదా అంతకన్నా ఎక్కువ వయసున్నప్పుడు పడుకునే ముందు ఒకటిన్నర టీ స్పూన్ తేనెను గనుక తాగిపిస్తే మంచి ఏటీసీలా పనిచేస్తుంది.
సిగరెట్ తాగేవారిని పిల్లలకు దూరంగా వుండనివ్వాలి. రూం ఏయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించాలి. పిల్లలకు వాడే బట్టలు, పరుపులు నీటిగా వుండేలా జాగ్రత్తపడాలి.
పిల్లలకు దగ్గు రావడానికి చాలా కారణాలున్నాయ్. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల దగ్గు ఎక్కువగా వస్తుంది. కొత్త రకాల వైరస్‌ల వల్ల కూడా దగ్గు వస్తుంది. నుమోనియా కూడా దగ్గు వచ్చేలా చేస్తుంది. కాబట్టి పిల్లలకు దగ్గు వస్తే తక్కువ అంచనా వేయకుండా వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. ఆస్తమా కూడా దగ్గు తెప్పిస్తుంది.
చలి వర్షాకాంలో దగ్గు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో, వర్షాకాలంలోనే పిల్లలకు దగ్గు ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దగ్గు బారిన పడకుండా వుంటారు. తరచూ పిల్లలకు తల్లిపాలు ఇస్తూనే వుండాలి. ఒక ఎక్స్‌ట్రా బ్లాంకెట్‌ను పిల్లలకు కప్పాలి. బేబీ మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించాలి. బేబీ చుట్టూ పరిశుభ్రంగా వుండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను ఇప్పించాలి. పసికందు శరీరానికి మసాజ్ చేయాలి. బేబీ వున్న రూంలో ఉష్ణోగ్రత తగినట్లు వుండేలా, మరీ ఎక్కువ చలి లేకుండా జాగ్రత్త పడాలి.



Click it and Unblock the Notifications