Latest Updates
-
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.!
మండే కాలంలో పసిపిల్లలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండలు బాగా మండిపోతున్నాయ్. వేసవి కాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో వడదెబ్బలు ఎక్కువవుతాయ్. పెద్దలనే ఊపిరాడకుండా చేసే ఈ ఎండలు ఇక చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మనకు తెలిసిందే. ఈ సమయంలో పసిపిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురౌతారు.
డీహైడ్రేషన్‌తో బాధపడుతుంటారు. విపరీతమైన చెమట, విరోచనాలు, నీరసం, కళ్లు తిరిగిపడిపోతుంటారు. శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పడిపోవడంతో బాడిలో శక్తిమొత్తం పోతుంది. కాబట్టి పిల్లల కోసం ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అందించిన సలహాలను మీ ముందు ఉంచుతున్నాం.

చర్మం చెమటకాయ..
పిల్లలకు ఎండవల్ల చెమటకాయ బాగా వస్తుంది. ఎండలో ఉండకుండా ఇంట్లో ఉన్నా సరే చెమటకాయ వచ్చేస్తుంది. ఛాతి, మెడ, వీపు భాగాలపై చెమటకాయ పిల్లలకు ఇబ్బందికరంగా మారుతుంది. చెమటకాయ తగ్గకపోతే మరికొన్ని చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు ఎప్పటికప్పుడు స్నానం చేయించడం చాలా ఉత్తమం. తరువాత చిన్నారి శరీరంపై నీరే ఏమీ లేకుండా మొత్తని కాటన్ వస్త్రంతో తుడిచివేయాలి.
స్నానం
పిల్లలకు స్నానం చేయించే నీటిలో కొంచెం వేపనూనె, లేదంటే నీలగిరి ఆకులు వేయడం చాలా మంచిది. మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్‌తో తయారైనవాటి కంటే ఈ వేపనూనె చాలా మంచింది. దీంతో స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములు నాశనమౌతాయ్. నీళ్లు మరీ అంత వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా చేసుకోవాలి.
దుస్తులు
ఈ ఎండాకాలం పిల్లలకు కాటన్ దుస్తులు మాత్రమే వేయించాలి. ఈ దుస్తులు లైట్ వెయిట్‌తో పాటు చెమటను పీల్చుకొని పిల్లలకు చెమటకాయ రాకుండాచేస్తుంది. పిల్లల శరీరం మొత్తం కాటన్ దుస్తులతో కవర్ అయ్యేలా చూడాలి.
హైడ్రేట్
శరీరం లోపల ఉన్న నీటిని ఎండ మొత్తం పీల్చేసుకుంటుంది. బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. పెద్దలే కాదు పసిపిల్లలకు కూడా నీరు చాలా అవసరం. అయితే పసి పిల్లలు హైడ్రేట్‌గా ఉండడానికి ప్రత్యేకంగా నీళ్లు తాగించాల్సిన పనిలేదు. ఆర్నెల్లలోపు పిల్లలకు తల్లిపాలే సురక్షితం. తల్లిపాలు అవసరమైనన్ని పట్టిస్తే ఎండ నుంచి వారు డీహైడ్రేట్ కాకుండాఉంటారు. ఈ విషయంలో డాక్టర్ సలహాలు సూచనలు పాటించాలి.
కొందరు.. పిల్లలను ఏసీగదుల్లో పెట్టి చల్లదనం కలిగించామనుకుంటారు. కానీ పిల్లలకు అంత చల్లదనం మంచిదికాదు. మరీ అంత ఎక్కువ చల్లగా, ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశం కాకుండా సహజంగా చెట్ల నుంచి వచ్చే గాలి ఉన్న ప్రదేశంలో పిసిపిల్లలను ఉంచడం చాలా ఉత్తమం. పసిపిల్లలు ఇంట్లో గదుల్లో ఉన్నప్పుడు వెంటిలేషన్ సరైన విధంగా ఉందో లేదు మరోసారి చెక్‌చేసుకోవాలి.
ప్రయాణాలు
ఈ ఎండాకాలం ఉన్నంతవరకు మధ్యాహ్నం ప్రయాణాలను నిలిపేసుకోవాలి. కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పసిపిల్లలను బయటకు తీసుకొనివెళ్లాలి. చల్లదనం కలిగించడానికి బయట ఐస్‌క్రీములు, జ్యూసులు, పానియాలు, పుల్లఐస్‌లు, గోలీసొడా, కూల్‌డ్రింక్స్ వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. బయట అమ్మే ఫ్రూట్‌జ్యూసుల్లో కూడా పాడైపోయిన పళ్లతో తయారు చేస్తున్నారు. కాబట్టి కొబ్బది బొండాలు లాంటివి మాత్రమే బయట తీసుకోవాలి. ఈ ఎండాకాలంలో పిల్లలను నిర్లక్ష్యం చేయకండి, ముఖ్యంగా పసిపిల్లల విషయంగా ఇక్కడి ఇచ్చిన కొన్ని జాగ్రత్తలైనా పాటించండి.



Click it and Unblock the Notifications