Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రసూతి సెలవుల కోసం సన్నాహాలు చేయడం ఎలా?

సూచన:
1. పరిశోధన చేయండి: ఎన్ని వారాలు ప్రసూతి సెలవు మంజురవుతుందో తెలుసుకోండి. శారీరక సమస్యలు, ప్రసవించే పద్దతి మొదలైన అంశాలు ప్రసూతి సెలవులని నిర్ధారిస్తాయి. జీతం తీసుకోకుండా ఎక్కువ కాలం ప్రసూతి సెలవులు పొందడానికి ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయేమో తెలుసుకోండి. మీ బాస్ కి లేదా ఇతరులకి చెప్పక ముందే ఈ పద్దతి పాటించడం ముఖ్యమైనది.
2. మానవ వనరుల శాఖతో మాట్లాడండి: కాగితాలపైన మీ ప్రసూతి సెలవు అధికారకంగా ఆమోదించబడేలా నిర్ధారించుకోండి. మీకు అనుమతించబడిన సెలవుని వాడుకోవడానికి ఎన్నో దశలు ఉన్నాయి. అందుకని, మీ hr తో ప్రసూతి సెలవులను పొందే విధానం గురించి తెలుసుకోవడం ద్వారా మిరు బిడ్డని కనే సమయంలో మీ పనులలో ఎటువంటి ఆశ్చర్యాలు ఉండవు. గర్భం దాల్చిన తరువాత ఆఫీస్ లో మిగతా వాళ్ళకి తెలియక ముందే మీరు ప్రసూతి సెలవుల గురించి hr తో మాట్లాడవచ్చు. మీ ప్రసవ సమయం గురించి సాధ్యమైనంత సమాచారం hr కి ఇవ్వండి. మీరు సెలవు తీసుకునే ఖచ్చితమైన తేదీ ని తెలుపలేకపోయినా, మీ డ్యూ డేట్ ప్రకారం ఒక అంచనా తో తేదీలని తెలుపండి. ఒకవేళ, ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ లో ఏమైనా మర్పులుంటే మీ hr కి వెంటనే తెలియచేయండి.
3. వెకేషన్ సెలవులని దాచుకోండి: మీకున్న వెకేషన్ సెలవులని భద్రపరచుకుని ప్రసూతి సెలవులతో కలిపి వాడుకోవచ్చు. అయితే, ముందుగా మీ యాజమాన్యంతో వెకేషన్ సెలవుల గురించి తెలుసుకోండి. ఎందుకంటే, ఒకవేళ వాడకపోయినట్లయితే వెకేషన్ సెలవులని పోగొట్టుకునే రిస్క్ ఉంది. అన్నివిషయాలు తెలుసుకున్న తరువాత వెకేషన్ సెలవులని మీరు ప్రసూతి సెలవులతో కలిపి వాడుకోవచ్చు.
4. మీ ప్రణాళికల ని మీ బాస్ కి తెలియచేయండి బేబీ పుట్టిన తరువాత మీరు పనిలోకి వచ్చే తేది గురించి మీ బాస్ తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి, మీరు గుడ్ న్యూస్ తెలిపే ముందు ఏం మాట్లాడాలో బాగా ప్రిపేర్ అవ్వండి.
5. మీ స్థానాన్ని భర్తీ చేసేవారికి పనులకి, ఫైల్స్ కి సంబంధించిన పూర్తీ సమాచారం ఇవ్వండి. మీరెంత సమాచారం ఇవ్వగలిగితే అంత ప్రశాంతంగా మీరు సెలవులో ఉన్నప్పటికీ ఆఫీస్ లో పనులు పూర్తవుతాయి. దీని ద్వారా మీరు ఆదరాబాదరాగా ఆఫీస్ కి వచ్చి కొన్ని పనులు పూర్తి చెయ్యడం తప్పుతుంది.
6. మీరు వెళ్ళే ముందు నియమాలు: మీరు సెలవులోకి వెళ్ళే ముందు ఏది ఓకే నో ఏది ఒకే కాదు క్లియర్ గా ఉండండి. ఒకవేళ సెలవులో కూడా మీరు కాంటాక్ట్ లో ఉండదలచుకుంటే ఏ సమయంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చో తెలపండి. ఒక వేళ మీరు కాంటాక్ట్ లో ఉండలచుకోలేకపోతే ఆ విషయం కూడా తెలపండి.
7. మీరు చెయ్యగలిగిన పనులు పుర్తిచేయ్యండి: మీరు నీట్ గా పూర్తీ చేసిన తరువాత మీ స్థానంలోకి వచ్చిన వాళ్ళు పనులని స్వీకరించడం చాలా సులభతరం. కొన్ని సార్లు అవాంతరంగా సెలవు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు ఏమి చేయలేము. అయితే, ప్రసూతి సెలవుల విషయంలో మీరు చేయగలిగినన్ని పనులు పూర్తీ చేసి వెళ్ళడం మంచిది. ప్రాజెక్ట్స్, ఫోన్ కాల్స్ లేదా ఇమెయిల్ వంటివి పుర్తిచేసేయండి. మీ స్థానం తాత్కాలికంగా భర్తీ చేసిన వాళ్ళకి సులభతరం.
చిట్కాలు
మీరు సెలవులో ఉన్నప్పుడు వ్యక్తిగతమైన వస్తువులని ఆఫీస్ లో ఉంచకండి. మీతోనే వాటిని తీసుకుని వెళ్ళడం ఉత్తమం ఇన్సురన్స్ సమాచారం, పెర్ఫార్మన్స్ ఎవాల్యూషన్ వంటి మీ అంతరంగిక సమాచారం ఉన్న పేపర్స్ ని మీ ఫైల్స్ లో నుండి తీసి మీతోటే తీసుకుని వెళ్ళండి.
మీరు సెలవు నుండి తిరిగి ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసిన వ్యక్తికి కృతజ్ఞత లు తెలుపడం మరచిపోవద్దు.



Click it and Unblock the Notifications