ఒక మంచి తల్లిగా ఉండడం ఎలా?

How to Be a Good Mother
మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ, పిల్లల ఎదుగుదల విషయంలో తండ్రి కంటే తల్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే, ఎన్నో సవాళ్ళను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది. అలాంటి సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.

సూచనలు:

1. ఓర్పుగా ఉండండి. ఒక తల్లిగా కొన్ని సందర్భాలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాలలో ఓర్పుగా ప్రశాంతంగా ఉండండి. సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఏదైనా సందర్భంలో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో మీ పిల్లలకి ప్రశాంతంగా వివరించండి.

2. మీ పిల్లల అభిరుచులపై మీరు కూడా ఇష్టాన్ని వ్యక్తపరచండి. మీ అబ్బాయికి సంగీతమంటే ఇష్టమున్నట్లయితే, ఒక గిటార్ కొని ఇవ్వండి. మీ అబ్బాయి గిటార్ వాయిస్తుంటే వినండి. ఎలాంటి సంగీతం ఇష్టం, ఇష్టమైన పాట వంటి ప్రశ్నలు అడగండి. అలాగే మీ అమ్మాయికి ఫాషన్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటే, సరదాగా షాపింగ్ కి కి తీసుకుని వెళ్ళండి. ఫాషన్ లో తనకి నచ్చిన విషయాలు అడిగి తెలుసుకోండి. వారి అభిరుచులని స్పష్టంగా తెలుసుకోండి. మీరు మీ పిల్లలని పిలిచినప్పుడు, వారి నుండి "ఏంటి" అని పెద్దగా లేదా బిగ్గరగా కోపం తో కూడిన స్వరం తో జవాబు వస్తే , "పర్వాలేదు, తర్వాత మాట్లాడదాం" అని చెప్పండి. ఆ తరువాత వారు మాములుగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడండి. మీ పిలుపుకి వారి నుండి సరైన సమాధానం రాకపోతే అసలేం జరిగిందో వెళ్లి తెలుసుకోండి. లేదా వారే వచ్చి మీతో చెప్పేవరకు వేచి చూడండి.

3. డబ్బుల విషయంలో మరీ టైట్ గా ఉండకండి. ప్రతీ రోజు డబ్బులని మీ పిల్లలకి ఇవ్వడం మంచిది కాకపోయినా వారు అడిగే ప్రతీ చిన్న విషయానికి డబ్బులు ఇవ్వరని చెప్పకూడదు. డబ్బులు అడిగిన ప్రతీ సారి పొదుపు, జాగ్రత్తలు వంటివి చెబితే వారి దృష్టిలో మీరు కఠినమైన తల్లిగా మిగిలిపోతారు. అవసరానికి తగ్గట్టు వారికి డబ్బులు ఇవ్వాలి . ప్రతిసారి ఏవైనా చిన్న చిన్నవి కొనిపెట్టండి. ఒక చాక్లెట్ లేదా చిప్స్ కొనిచ్చినా వారి సంతోషానికి అవధులు ఉండవు. అప్పుడప్పుడూ వారికవసరమైన వస్తువులని కొనిపెట్టండి. వారికి నచ్చిన రంగులో ఉండే ఐ పాడ్, లేదా టీనేజ్ పిల్లలకి అవసరమైన కంప్యూటర్ వంటివి కొనివ్వండి. వారు ఎప్పటినుంచో కావాలని ఆశ పడుతున్న వస్తువులని వారి పుట్టినరోజు కానుకలుగా ఇవ్వండి. అప్పుడప్పుడూ సరదాగా డిన్నర్ కి, ఏదైనా మూవీ కి తీసుకెళ్ళండి.

4. మీతో మీ పిల్లలు మాట్లాడేందుకు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడండి. అర్ధం చేసుకోవడానికి, చక్కగా వినడానికి ప్రయత్నించండి. అమ్మ దగ్గర లభించే సలహా, యుక్తవయసు పిల్లలకి అవసరమైన సూచనలు, స్నేహం, హోంవర్క్ లో సహాయం, లేదా మృదువైన కౌగిలి ఇవన్నీ పిల్లలకి ఒక ధైర్యాన్ని కలిగిస్తాయి. వారితో ఎవరూ మాట్లాడకపోతే వారు కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు. కాబట్టి, వారితో వీలైనప్పుడల్లా మాట్లాడండి.

5. మీ పిల్లల అభిరుచులు, స్నేహితులు, ఇంకా వారి ఇష్టాలని ఎగతాళి చేయకండి. వారికి సహాయంగా ఉండండి. మీ పిల్లలకి మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని లేకపోతే మీరు వారిని బలవంతంగా డాక్టర్ అవ్వాలని ఇబ్బంది పెట్టకండి. ఇది మీ పిల్లల జీవితం. వారి జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు వారికీ తీసుకునే స్వేచ్చ ఉంది. మీ ఆలోచనలకి మీ పిల్లల ఆలోచనలకి భేదం ఉన్నా సర్దుకుపొండి. మీ ఆలోచనలకి భిన్నంగా ఆలోచిస్తున్నారని అవేశపడకండి. మీ అబ్బాయికి బాగా చదివి ఇంజనీర్ అవ్వాలని ఉంటే మీ వైపు నుండి సహాయపడండి. మీ పిల్లల స్నేహితులని చూసి ఎగతాళి చేయకండి. మీ అమ్మాయి హిప్ హాప్ మ్యూజిక్ విన్నా ఎక్కువగా ఐ లైనర్ పెట్టుకున్నా విమర్శించకండి. మీ అబ్బాయి హాస్యంగా యాస కలిగిన అబ్బాయితో స్నేహం చేసినా, మీ అబ్బాయి స్నేహితుడి స్కిన్ కలర్ నలుపు అయినా మీరు వారి స్నేహితుల విషయంలో జోక్యం చేసుకోకండి. మీ పిల్లలు చేసేవి కొన్ని మీరు చేయకపోవచ్చు. ఇది వారి జీవితం. మీ జీవితం కాదు. చదువు, ఆహారం, పాకెట్ మనీ వంటి ముఖ్య విషయాలలో మీ ప్రభావం ఎలాగో వారిపైన ఉంది. అతిగా వారి విషయాలలో జోక్యం చేసుకోకండి.

6. ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడానికి ఆలోచించకండి. తప్పుని ఒప్పుకుని క్షమాపణ చెబితే అందరికీ మంచిది. మీరు క్షమాపణ చెప్పని మొండి వారిగా ఉండడం కంటే, తప్పు చేయడం సహజమని, చేసిన తప్పు సరిదిద్దుకుని క్షమాపణ అడగడం యొక్క విలువని మీ పిల్లలకి వివరించండి. ప్రశాంతంగా సందర్భాన్ని విశ్లేషించి, మీరు తప్పు ఎక్కడ చేసారో ఎందుకు చేసారో ఆలోచించుకోండి. ఆ తరువాత అలా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో తెలుసుకోండి. క్షమాపణ అడగడానికి "నా ప్రవర్తనకి నేను క్షమాపణ అడగదలుచుకున్నాను. అది తప్పని ఇప్పుడు అర్ధం అయ్యింది" అని అసలు విషయం తెలియచేయండి.

7. మీ పిల్లలు తండ్రిపై అమితమైన ప్రేమని చూపిస్తే ఈర్ష పడకండి.

8. చివరగా, మీ పిల్లలని అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించండి. వారిని ప్రేమించకుండా వారి కి ఎన్ని చేసినా విలువ ఉండదు. మీరు మీ పిల్లలని ప్రేమించినా లేకున్నా, వారి గుండె లోతుల్లో మాత్రం మీ పైన అమితమైన ప్రేమ ఉంటుందని అర్ధం చేసుకోండి.

జాగ్రత్తలు:

1. మీ పిల్లల స్నేహితులతో ఉన్నప్పుడు మీరు మీ లాగే ప్రవర్తించండి. మీరు మీ పిల్లల తల్లి అని, ఒక స్నేహితురాలు కాదని గుర్తుంచుకోండి.

Story first published: Saturday, January 12, 2013, 12:01 [IST]
Desktop Bottom Promotion