Latest Updates
-
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది?
వర్కింగ్ మదర్ ప్రణాళికాబద్దంగా ఉండటం ఎలా..!
పనిచేసే వంటరి తల్లులు చాలా సార్లు ఒత్తిడి అనుభవిస్తారు. రోజంతా తీరిక లేకుండా పని చేసి వచ్చాక మళ్ళీ రాత్రిభోజనం వండాలి, హోమ్ వర్కులు చూసి, స్నానాలు చేయించి, రేపటి కోసం తయారవ్వాలి. ఇలాంటప్పుడు మరింత మెరుగైన నిర్వహణకి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చర్యలు:
1. మీ మట్టి మూకుడు దుమ్ము దులపండి లేదా స్లో కుక్కర్ ని ఉపయోగించి రాత్రి భోజనం తయారుచేయండి. మీ సమయ౦ ఆదా అవుతుంది, మీరు ఇంట్లోకి వచ్చినపుడు రుచికరమైన వాసన మిమ్మల్ని ఆహ్వానిస్తుంది.
2. ప్రతిరోజూ రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఒకటి లేదా రెండు వస్తువులు కొనుక్కునే బదులు వారానికి ఒకసారి సరుకులు కొనుగోలు చేయండి. సమయానికి ముందే భోజనానికి ఏర్పాటు చేయండి. మీరు ఆలస్యంగా వస్తారనుకుంటే, బాక్సులలో లేదా శీతలీకరించిన భోజనాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇంటికి వచ్చేటపుడు ఫాస్ట్ ఫుడ్ తీసుకునే అలవాటును మానుకోండి.
3. స్కూలుకు తీసుకువెళ్ళే సరుకు నిల్వ ఉంచుకోండి. దీని వల్ల భోజన సమయం మధ్యలో మీ పిల్లవాడు పోస్టర్ బోర్డ్, మార్కర్లు లేదా ఏదో ఒకదానికోసం అకస్మాత్తుగా బైటికి వెళ్లక్కర్లేదు.

4. ఒకసారి మీ పిల్లల హోమ్ వర్క్ పూర్తి అయితే, తరువాతి రోజుకి వారి బాగ్ పాక్ లు సిద్ధంగా ఉంచుకోమని చెప్పండి. సంతకం చేయడానికి అవసరమైన స్లిప్పులను, ఉపాధ్యాయులనుండి నోట్సులను, డబ్బు తెమ్మనే అభ్యర్ధనను మొదలైన వాటిని తనిఖీ చేయండి. నియమిత స్థలంలో సంచులను ఉంచండి.
5. లైబ్రరీ బుక్స్ కోసం ఒక బుట్టను లేదా బాక్సును ఏర్పాటుచేయండి. చదవక పొతే, ఆ పుస్తకాలని తిరిగి అక్కడే ఉంచమని గట్టిగా చెప్పండి.
6. మరుసటి రోజుకి దుస్తులను ఏర్పాటు చేసుకోండి. ఔటర్ వేర్ లను అదేచోట ఉంచినట్లయితే, మీరు తొడుగులను, గొడుగులను వెతుక్కునే అవసరం ఉండదు.
7. రాత్రే రేపటి భోజనాన్ని పాక్ చేసుకోండి.
8. ప్రతిరోజూ తక్కువ బట్టలను ఉతకండి, అందువల్ల వారాంతంలో ఇస్త్రీ చేయడానికి ఎక్కువ బట్టలు పోగుపడకుండా ఉంటాయి.
9. గిన్నెలు శుభ్రం చేయడానికి సమయాన్ని కేటాయించ౦డి, చెత్తని పారేయండి. అందువల్ల ఈ పనిని మీరు ఉదయాన్నే చేయక్కర్లేదు.
10. శుభ్రం చేసే పనులను చిన్న విభాగాలుగా చేసి, రోజుకు ఒక పనిని చేసే అవకాశాన్ని పరిశీలించండి.
11. రాబోయే కార్యక్రమాలకు సంభందించి స్కూల్ ఆన్ లైన్ క్యాలెండర్ను తనిఖి చేసే వాటిని మీ క్యాలెండర్ లోనికి వ్రాసుకోండి.
12. మీ పిల్లలకు వారి పనులకు వారే బాధ్యతా తీసుకునేలా నేర్పండి. ఉదాహరణకి వారు మర్చిపోయిన వస్తువులను మీ ఉద్యోగం మానేసి స్కూల్ కు మీరు తీసుకొని వెళ్ళలేరనే విషయం వారు అర్ధం చేసుకోవాలి.
13. సాధ్యమైనంత వరకు మీ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. మీ సమయాన్ని, శక్తిని హరించే పనులకు చేయనని చెప్పడానికి భయపడకండి.



Click it and Unblock the Notifications
