Just In
- 23 min ago
శరీరంలో ఎలాంటి నొప్పినైనా తగ్గించే సహజ నొప్పి నివారణలు
- 6 hrs ago
సోమవారం మీ రాశిఫలాలు (9-12-2019)
- 22 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- 1 day ago
ఆదివారం మీ రాశిఫలాలు (8-12-2019)
Don't Miss
- Sports
Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట వీడియో
- News
ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: మొత్తం ఏడు వర్కింగ్ డేస్: బీఏసీలో నిర్ణయం..!
- Finance
విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్
- Movies
'వెంకీమామ'లో ఆ 40 నిమిషాలు.. హైలైట్ సన్నివేశాలివే!
- Technology
జియోను అదిగమించిన వోడాఫోన్,ఎయిర్టెల్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పీరియడ్స్ సమయంలో అందులో పాల్గొంటే కచ్చితంగా గర్భం వస్తుందా? మా ఆయన బాగా ఇబ్బందిపెడుతున్నాడు
ప్రశ్న : నాకు పెళ్లయి నాలుగేళ్లు అవుతుంది. మాకు పిల్లలు కలగలేదు. ఇక నాకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కాస్త ఆరోగ్యం అంతగా బాగుండదు. ఏదో నలతగా ఉన్నట్లు ఉంటుంది. ఆ సమయంలో ఫుల్ రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది.

సెక్స్ లో పాల్గొంటే
అయితే మా ఆయన ఈ మధ్య నాకు ఒక విషయం చెప్పారు. పీరియడ్స్ వచ్చినప్పుడు సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందని ఆయనతో ఎవరో చెప్పారంట. దీంతో నన్ను ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనమని పట్టుపడుతున్నాడు.

చాలా చిరాగ్గా ఉంటుంది
నాకు ఆ టైమ్ లో చాలా చిరాగ్గా ఉంటుంది. నా శరీరం అందుకు అస్సలు సహకరించదు. నిజంగా పీరియడ్స్ వచ్చిన సమయంలో సెక్స్ లో పాల్గొంటే ప్రెగ్నెంట్ అవుతానా? అలా అవుతానంటే ఓపిక చేసుకుని అందులో పాల్గొంటాను. మా ఆయన పిల్లలు కలగలేదని బాధపడుతున్నాడు. అందువల్ల నేను ఆ సమయంలో సెక్స్ కు ఒప్పుకుందామనుకుంటున్నాను.

గర్భం వస్తుందనేది అపోహ
సమాధానం : పీరియడ్స్ లో టైమ్ లో సెక్స్ లో పాల్గొంటే గర్భం వస్తుందనేది అపోహ. ఆ సమయంలో కలయిక అనేది కొందరు స్త్రీలకు అస్సలు ఇష్టం ఉండదు. మీకు ఆ సమయంలో అందులో పాల్గొనాలని లేకుంటే పాల్గొనకండి. పీరియడ్స్ వచ్చిన తర్వాత పదకొండు నుంచి పదహారో రోజు మధ్యలో అండం విడుదలయ్యే అవకాశం ఉంది.

అండం విడుదలైనప్పుడు
మీరు అండం విడుదలైన సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భిణీ అయ్యే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు అండం విడుదల కాదు. మీకు ఆ రోజు ఆరోగ్యం సరిగ్గా ఉండదని చెబుతున్నారు కాబట్టి మీరు ఆ రోజు ప్రశాంతంగా ఉండండి. మీ ఆయన ఇవన్నీ చెప్పి చూడండి. ఆయన అర్థం చేసుకోకుంటే డాక్టర్ వద్దకు తీసుకెళ్లి డాక్టర్స్ తో చెప్పించండి. ఆయన అపోహల వల్ల మీరు ఇబ్బందులుపడకండి. ఆ సమయంలో సెక్స్ చేసుకోవడం తప్పు మాత్రం కాదు. కొందరు కండోమ్ యూజ్ చేసి సెక్స్ చేసుకుంటారు. కానీ ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా గర్భం వస్తుందనేది మాత్రం అపోహ.