Latest Updates
-
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా! -
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.! -
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్! -
జూన్ 1, 2026: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో తిరుగులేని విజయాలు మీ సొంతం! -
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. -
సోషల్ మీడియాలో రాజయోగం పేరుతో హడావుడి.. ఈ రాశుల వారికి నిజంగానే అదృష్టం ఉందా? -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే మటన్ ఊరగాయ.. ముక్క తగిలితే మజానే!
ఈ చిట్కాలు పాటిస్తే, మీ పిల్లలు ఫోన్ చూడకుండా వదిలేసి పారిపోతారు!
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాల్లో భాగమైపోయాయి. ఫోన్ లేకుండా మనకు సంబంధించిన ఏ పని కూడా పూర్తి కావడం లేదు. పెద్దలు మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా ఈ మొబైల్ ఫోన్లతో బానిసలవుతున్నారు. గతంలో పిల్లలు బడికి వెళ్లి తిరిగి వచ్చాక బయట ఆడుకోవడం లేదా ఇంట్లో పుస్తకాలు చదవడం చేస్తుండేవారు. కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లలోనే గడుపుతున్నారు. దీని వల్ల వారి ఆరోగ్యం, చదువు, ఆలోచనా విధానం, శారీరక వ్యాయామం వంటి అన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
పిల్లలు ఫోన్ ఎక్కువగా చూడడం వలన వారి ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం కావడం మాత్రమే కాకుండా వారిలో తెలియని మార్పులు కూడా మొదలవుతాయి. వారి ఆలోచన విధానంలో తేడా వస్తుంది. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వలన వారిలో కంటికి సంబంధించిన సమస్యలు, మానసిక సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఫోన్లలో గేమ్స్ ఆడడం, వీడియోస్ చూడడం వలన వారు ఒంటరితనానికి అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా గ్రహించి కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానేస్తుంటే పిల్లలు ఏడవడం మొదలు పెట్టేస్తున్నారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే పిల్లలు ఫోన్ చూడకుండా వదిలేసి పారిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బహిరంగ ఆటలకు ప్రోత్సాహం ఇవ్వండి: మీ పిల్లలు ఫోన్ నుంచి దూరంగా ఉండాలంటే, కష్టమైనా ఇబ్బందులు కలిగించినా వారిని బహిరంగ ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. పిల్లలను బహిరంగ ఆటలకు ప్రోత్సహించడం ద్వారా వారిని శారీరక వ్యాయామం చేసేందుకు ఉత్సాహపరచవచ్చు. క్రీడలు, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యక్తిగత క్రీడలు లేదా ఫుట్‌బాల్, క్రికెట్ వంటి బృంద క్రీడలు పిల్లలను ఆకట్టుకుంటాయి.
పిల్లల దృష్టికి ఫోన్ రాకుండా ఉంచండి: మొబైల్ ఫోన్లను పిల్లల కళ్లకు అందకుండా ఉంచితే వారు వాటిని పట్టించుకోరు. వీరితో కలిసి నిద్రించే సమయంలో ఫోన్‌ను వారి పడకగదిలో ఉంచకూడదు. అలాగే, చిన్న వయసులోనే పిల్లలకు వ్యక్తిగత ఫోన్ ఇవ్వడం తప్పనిసరి కాదు.
స్క్రీన్ సమయాన్ని షెడ్యూల్ చేయండి: మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం కష్టమైన పని. అయితే, ఫోన్‌ను పరిమిత సమయంలో వాడేలా చేయొచ్చు. ఉదాహరణకు, వారికొక ప్రత్యేక సమయం ఏర్పాటు చేసి, రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే యూట్యూబ్ లేదా గేమ్స్ ఆడే అవకాశం ఇవ్వాలి.
కుటుంబంతో సమయం గడపండి: పిల్లలు ఎక్కువగా ఒంటరిగా ఉండేటప్పుడు ఫోన్ వాడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం ఇంట్లో సరదాగా గడిపి, కబుర్లు చెప్పి, పుస్తకాలు చదివించండి. ఇలా చేయడం ద్వారా వారు మొబైల్ ఫోన్‌పై ఆసక్తి తగ్గిస్తుంది.
తల్లిదండ్రులు తమ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి: పిల్లలు తల్లిదండ్రులను చూసే అలవాటు ఉంటాయి. మీరు ఎప్పుడూ ఫోన్ వాడుతున్నట్లయితే, వారు కూడా అదే అలవాటు పడతారు. అందుకే, మీరు కూడా అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్‌ను వాడాలి. ఈ చిట్కాలను పాటించడంతో, పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలైపోకుండా, ఆరోగ్యకరమైన, సాఫల్యమైన జీవితం గడపగలుగుతారు.



Click it and Unblock the Notifications