Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
ప్రెగ్నెన్సీ వున్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే ఎన్నో లాభాలు.. కొన్ని పరిస్థితుల్లో మినహా..!
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్లు మార్పు చెందుతూ వుంటాయ్. హార్మోన్లు మార్పు చెందడం వల్ల శృంగార కోరికలు కూడా అధికంగా పెరుగుతాయ్. ప్రెగ్నెన్సీ రాాగానే శృంగారంలో ఎక్కువగా పాల్గొనాలని గర్భిణులకు వుంటుంది. ఇది వారిలో వచ్చే సహజమైన లక్షణం. ప్రెగ్నెన్సీ వల్ల చాలా రోజులు గ్యాప్ వస్తుందన్న భయం వల్ల కూడా సెక్స్ చేయాలన్న కోరిక పెరుగుతుంది.
కోరికలు ఎక్కువగా వుండడం వల్ల శృంగారం చేయడానికి రెడీ అవుతారు. కానీ కడుపులో వున్న బిడ్డకు ఏదైనా అవుతుందేమోనన్న భయం అటు భార్యకు, ఇటు భర్తకూ ఇద్దరికీ వుంటుంది. అయితే ఈ సమస్యలో వైద్యులు భార్యా భర్తలను శృంగారంలో పాల్గొనవద్దని ప్రత్యేకంగా చెప్పనంతవరకు దంపతులు శృంగారం చేయవచ్చు. శృంగారం చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం బాగా అందడమే కాకుండా జననేంద్రియాలకు కూడా రక్త సరఫరా బాగా జరుగుతుంది.

గర్భిణిగా వున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్లు, సెక్స్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్లు వల్ల మంచి అనుభూతిని దంపతులు అనుభవిస్తారు. శృంగార సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ల మంచి మూడ్‌ను తీసుకొని వస్తాయ్. ఆ సమయంలో ఏదైనా ఒత్తిడి వుంటే దూరమౌతుంది. శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదల కావడం వల్ల అటు తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ చాలా మంచిది అని వైద్యులు చెబుతున్నారు.
శృంగారం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం చేయడం వల్ల గర్భిణికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల కడుపులోని బిడ్డకు కూడా చాలా మంచిది. గర్భిణిగా వున్నప్పుడు మరింత ఫిట్‌గా వుండాలంటే శృంగారం చేయమని నిపుణులు సలహా ఇస్తున్నారు. సెక్స్ వల్ల ఎదైనా కొవ్వు పేరుకొని పోయి వున్నా అది కరిగిపోతుందని అంటున్నారు.
గర్భిణిగా వున్నప్పుడు శృంగారంలో పాల్గొనడం వల్ల కడుపులో వున్న పిండం బయటకు వస్తుందని కొందరు భయపడుతుంటారు. ఇలాంటిది ఏమీ జరగదని వైద్యులు చెబుతున్నారు. సెక్స్‌లో పొల్గొన్నప్పుడు వెజైనా దగ్గర కొంచెం నొప్పి వుండడం అసౌకర్యం ఫీల్ అవడం సహజమని అంటున్నారు. అయితే మొదటి మూడు నెలలు మాత్రం సెక్స్‌లో పాల్గొనవద్దని చాలా మంచి వైద్యులు సూచిస్తున్నారు. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో గనుక సెక్స్‌లో పాల్గొంటే కడుపులో వున్న పిండం బయటకు సులభంగా వచ్చి, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అంటున్నారు. కాబట్టి మొదటి మూడు నెలలు భర్తకు భార్య దూరంగా వుండాలని సూచిస్తున్నారు.
కొందరి గర్భిణుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ వుంటుంది. ఇలాంటి వారిలో అప్పడప్పుడూ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. అలాంటి సమయంలో వైద్యులను సంప్రదించి మాత్రమే శృంగారంలో పాల్గొనాలి లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపులో కవలలు పెరుగుతుంటే కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇలాంటి కేసుల్లో కూడా సెక్స్‌లో పాల్గొనవద్దని కొందరు సూచిస్తున్నారు. కొందరిలో వెజైనా సమస్యలు వుంటాయ్. ఈ సమస్యలు వున్నవారు కూడా శృంగారంలో పాల్గొనవద్దని చెబుతున్నారు. గర్భసంచి లూజ్‌గా వుండి కుట్లు వేయించుకున్నవారు సెక్స్‌లో పాల్గొంటే కూడా తీవ్రమైన సమస్య వచ్చే అవకాశం వుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని శృంగారంలో పాల్గొనాలి.



Click it and Unblock the Notifications