Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చిన్న పిల్లలకు ముద్దులు పెడుతున్నారా.. అయితే వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకంటే?
చిన్నపిల్లలు అంటే అందరికీ ఇష్టమే. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఎవరైనా ఎత్తుకొని చెంపలపైనా ముద్దులు పెడుతారు. ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతూ వారిని ఆడిస్తుంటారు. అయితే పిల్లలను ఎక్కువగా ముద్దులు పెట్టుకోకూడదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ముద్దులు పెట్టడం వల్ల వారికి రోగాలు వస్తాయని, వైరస్‌లు వారిని వేటాడే అవకాశం ఉందని తేలింది. అసలు ముద్దులు పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్స్..
లీస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బృందం చిన్న పిల్లలకు ముద్దులు పెట్టె అంశంపై అధ్యయనం జరిపింది. ఈ అధ్యయనంలో చిన్న పిల్లలకు ముద్దులు పెట్టడం వల్ల అనేక సమస్యలు వస్తాయని తేలింది. చిన్న పిల్లలకు ఆ వయసులోనే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా చిన్న పిల్లలకు ముద్దులు పెట్టడం వల్ల వారి ద్వారా పలు ఇన్ఫెక్షన్స్ పిల్లలకు సోకె అవకాశం ఉందని తేలింది. మూడు సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్న పిల్లలకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారికి ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ అయినా చాలా త్వరగా సోకుతుందని తేలింది.

ఎవరైనా ముద్దులు పెట్టె సమయంలో వారి పెదాలు, చేతుల ద్వారా శరీరంలోని వైరస్, లేదా బ్యాక్టీరియా వెళ్తుందని, ఇది పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిల్లలకు ముద్దలు పెట్టినా ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. పిల్లలు రోగాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందంటున్నారు. అవి ఏవంటే..
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
శుభ్రత ముఖ్యం:
చిన్న పిల్లల విషయంలో శుభ్రత అనేది చాలా ముఖ్యం. చిన్న పిల్లలను ముట్టుకునేటప్పుడు శుభ్రతను కచ్చితంగా పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కొని పిల్లలను కడుక్కోవాలి. చిన్నపిల్లలను ముఖంపై ముద్దులు పెట్టుకునే బదులు.. వారి పాదాలపై, తల వెనుక భాగంలో ముద్దు పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ సమస్య తక్కువగా ఉండడంతో పాటు రోగాలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇతరులకు కూడా చెప్పాలి:
చిన్న పిల్లలను ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రమే ముద్దు పెట్టుకోవడం కాదు.. ఇతరులు కూడా ముద్దు పెడుతుంటారు. అయితే ఇతర వ్యక్తులు ముద్దు పెట్టుకునేముందు వారిని కూడా.. ముద్దు పెట్టుకోకూడని చెప్పాలి. ఈ విషయంలో మొహమాటం పడితే కచ్చితంగా పిల్లలకు రోగాలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల్లో చిన్నారి ఆరోగ్యమే ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లల మొహంపై ముద్దు పెట్టుకోవద్దని చెప్పాలి.
ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇలా చేయాలి..
పిల్లలకు పుట్టుకునే పెద్దలకు, తల్లి తండ్రులకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. పిల్లలను పట్టుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా శిశువులకు ఒక నెల నిండే వరకు ఎట్టి పరిస్థుల్లో కూడా ముట్టుకోకూడదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులు.. పిల్లల దగ్గరకు వెళ్లాలంటే తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించి వారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications