For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాత్రికి వద్దులే...!

By B N Sharma
|

'Abstinence' underwear to stop teen mating
'జిప్ వేసేయ్'....'ఈ రాత్రికి వద్దు'....అనే పేర్లతో ప్రత్యేకించి టీనేజ్ పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కంపెనీ బ్రిటన్ లో అండర్ వేర్లు తయారు చేస్తోందట.ఈ అండర్ వేర్లు ఆన్ లైన్ లో చాలా హాట్ గా అమ్ముడుపోతున్నాయట. ఆన్ లైన్ లో అమ్మే ఈ విక్రయానికి సైతం ' మీ అమ్మ ఏం చేస్తుంది' అనే బేనర్ పెట్టి అమ్మేస్తున్నారట.

చిన్న వయసు నుండే, డేటింగ్ లు, అక్రమ సంబంధాలవంటి చర్యలు నానాటికి పెరిగిపోతున్న ఈ రోజులలో కుటుంబాల నైతిక విలువలు దృష్టిలో పెట్టుకొని సంబంధాలు, డేటింగ్ వంటి వాటిని నిరుత్సాహ పరచటానికిగాను తాము ఈ దుస్తుల రేంజి తయారు చేస్తున్నామని తయారీ దార్లు చెపుతున్నట్లు డైలీ మెయిల్ వార్తా పత్రిక తెలుపుతోంది.

టీనేజర్లకు తాము చేస్తున్న తప్పులు తెలియపరచటానికిగాను చిన్నపాటి రహస్య హెచ్చరికగా తాము తయారు చేసే అండర్ వేర్ల రేంజి వుంటుందని భావిస్తున్నట్లు తయారీ దార్లు తెలుపుతున్నట్లు డెయిలీ మెయిల్ ప్రచురించింది. సంయమనం పాటించండంటూ అమెరికాలో జరుగుతున్న టేనేజర్ల ఉద్యమానికి ఇది సహాయకారిగా కూడా వుండగలదని వీరు భావిస్తున్నారు.

English summary

'Abstinence' underwear to stop teen mating | ఈ రాత్రికి వద్దులే...!

"We created a line of underwear to use as conversation starters to help reinforce family morals as they relate to relationships and dating," the Daily Mail quoted What Would Your Mother Do as saying.While unlikely to sway most youngsters in Britain, the designs will perhaps tap into the growing abstinence movement in the U.S.
Story first published:Tuesday, November 29, 2011, 14:48 [IST]
Desktop Bottom Promotion