Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆధునిక ఆటలు -పార్టీలలో ఆనందం!

ఛైనీస్ విస్పర్ - ఈ ఆటకు చాలామంది పిల్లు వుంటే, ఎంతో సరదాగా వుంటుంది. దీనికి అవసరమయ్యే వస్తువులు ఏమీ వుండవు. కావలసిందల్లా పిల్లలు కడుపుబ్బ నవ్వే మాటలు మాత్రమే. పిల్లలను ఒక సర్కిల్ లో కూర్చోపెట్టండి. మొదటి పిల్లాడికి చెవిలో ఒక ఇంగ్లీష్ మాట చెప్పండి. దానిని హిందీ లేదా మరో ఇతర భాషలోకి తర్జుమా చేసి రెండవ పిల్లవాడి చెవిలో చెప్పమనండి. రెండవ పిల్లాడు మరల దానిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి మూడవ పిల్లాడికి చెప్పాలి. ఈ రకమైన తర్జుమా చివరి పిల్లవాడి వరకు జరుగుతుంది. చివరి పిల్లాడిని తాను విన్న మాటను బిగ్గరగా బయటకు చెప్పమనండి. ఈ ఆటను పిల్లలు ఎంతో ఆనందంగా ఆడేస్తారు.
ట్రాఫిక్ లైట్ - ఈ పార్టీ ఆటను ఇతర దేశాలలో కూడా వివిధ పేర్లతో ఆడతారు. కాని మనం దీనిని ట్రాఫిక్ లైట్ అంటాము. ఈ ఆటకు చక్కని సమయం, వేగంగా ఆలోచిస్తూ ఫెయిర్ గా ఆడాలి. ఒక గీత గీయండి. ఒక పిల్లాడిని ట్రాఫిక్ లైట్ గా చెపుతూ దానిపై నిలబెట్టండి. ఈ ఎంపికను చిట్స్ వేసి చేయండి. మిగిలిన పిల్లలు ఆలైనుకు వెనుక భాగంలో కొంత దూరంలో అంటే 10 అడుగుల నుండి 40 అడుగుల వరకు నిలబడి వుంటారు. ట్రాఫిక్ లైట్ పిల్లాడు పిల్లలవైపు తిరిగితే రెడ్ లైట్ గాను అతను పక్కకు తిరిగితే గ్రీన్ లైట్ గాను చెప్పాలి. గ్రీన్ పడ్డపుడు ఆడే పిల్లలందరూ ట్రాఫిక్ లైట్ వైపు కదులుతారు. కొద్దిసేపైన తర్వాత ట్రాఫిక్ లైట్ పిల్లవాడు మరల వారికెదురుగా తిరుగుతూ రెడ్ లైట్ ప్రకటిస్తాడు. రెడ్ లైట్ ప్రకటించినపుడు ఎవరైనా పిల్లవాడు పట్టుబడితే అతనిని లైనులో మొదటి భాగానికి పంపుతారు. గీయబడిన లైను దాటిన మొదటి ఆటగాడు ట్రాఫిక్ లైట్ అవుతాడు.
డాంకీ టెయిల్ లేదా గాడిద తోక - దీనికవసరమైన వస్తువులు తోక లేని గాడద బొమ్మ, ఒక గాడిద తోక, కళ్ళకు కట్టే గుడ్డ. ఒక్కో పిల్లాడికి కళ్ళకు గుడ్డ కట్టి గాడిద బొమ్మ చుట్టూ మూడు సార్లు తిప్పండి. వారిని డాంకీ వున్న దిశగా నిలబెట్టండి. పిల్లలు తోక బొమ్మను పట్టుకొని గాడిద బొమ్మలోని గాడిద తోక భాగంలో దానిని సరిగ్గా అంటించాలి. సరి అయిన ప్లేస్ లేదా దానికి దగ్గరగా అంటించిన వారు ఆటలో గెలుపొందినట్లే.
స్లీపింగ్ పైరెట్ - ఈ ఆటలో పైరేట్ గా ఒక పిల్లాడుంటాడు. పిల్లలందరూ ఒక సర్కిల్ లో కూర్చుంటారు. పైరెట్ పిల్లాడి కళ్ళకు గుడ్డ కట్టేయాలి. వాని ఎదురుగా ఒక తాళాల గుత్తి వుంచాలి. చుట్టూ కూర్చున్న పిల్లలలో ఒకరిని పైరేట్ కు తెలియకుండా తాళాలగుత్తి తీసి దాచుకుని కూర్చోమనాలి. ఇపుడు పైరేట్ ఆ ధ్వని సహాయంతో తాళాల గుత్తి ఎవరు తీశారనేది గుర్తించి చెప్పగలగాలి.
ఈ ఆటలన్ని వివిధ రకాల పార్టీలలో పిల్లలు ఆడుకుని ఆనందించేవిగా వుంటాయి.



Click it and Unblock the Notifications