Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
పిల్లల వ్యక్తిత్వం పెరగాలంటే?

1. పిల్లలను శిక్షించకండి. మాటలతో తిట్టి గాయపరచకండి. తల్లి తండ్రులు ఇచ్చే ప్రేమానురాగాలు వారిని భవిష్యత్తులో మంచి వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దుతాయి.
2. చిన్నతనంలో మీరూ ఎన్నో తప్పులు చేసి వుంటారు. కనుక తప్పులు జరిగినప్పటికి వాటిని వివరిస్తూ పిల్లాడి మనసు గెలవండి. అవసరానికే సలహా ఇవ్వండి. అధికంగా సలహాలిస్తే, ఏదీ సీరియస్ గా తీసుకోడు. గత తప్పులు ఎత్తి చూపితే, మొండిగా తయారవుతారు.
3. అతని అవసరానికి వెంట వుండండి. కష్టాలలో స్నేహితులవలే ఆదుకోండి. మంచి పని చేస్తే అభినందించండి. ఇవి మీ మధ్య సంబంధాలను మెరుగుపరుస్తాయి.
4. పిల్లలకు బహుమతులివ్వండి. అవసరమైన వస్తువులు బహుమతిగా ఇస్తే, ఆనందపడతారు. అంతే కాక, దొంగిలించాలని, అబద్ధం చెప్పాలని, రహస్యంగా వుండాలన్నవి వారి మైండ్ కు రావు.
5. పిల్లాడి మనసు గెలవాలంటే మంచి ఆహారం ఇవ్వాలి. వారాంతపు సెలవలలో లేదా పుట్టిన రోజున వారికిష్టమైన ఆహారాలు ఇచ్చి సంతోష పెట్టండి. వారు మరచిపోరు. రుచికర ఆహారం శారీరకంగా మానసికంగా తృప్తి నిచ్చి ఆనందం ఇస్తుంది.
కష్టపడి పనిచేయాలని, వ్యక్తిత్వం పెంచుకోవాలని, కుటుంబ గౌరవం కాపాడలని మొదలైన విలువలు నిరంతరం బోధించండి. పిల్లవాడి మనసును గెలవాలంటే ఇవే మార్గాలు.



Click it and Unblock the Notifications