Latest Updates
-
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా!
పిల్లల్లో అధికబరువు నివారణకు ఆహార చిట్కాలు!

1. మొదటగా మీ పిల్లవాడిని డాక్టర్ చే పరీక్ష చేయించండి. లావెక్కడానికి గల కారణాల పరీక్షా నిర్ధారణ చేయండి. అతనికి గల అధిక బరువు వంశానుగతమా? లేక అతని శరీర తత్వమా? అనేది తెలుసుకోండి.
2. బరువును తగ్గించే ప్రణాళికను తయారు చేయండి. ప్రస్తుత బరువు చూడండి. పిల్లాడి ఎత్తును బట్టి అతను ఎంత బరువు వుండాలో నిర్ధారించండి.
3. ఆటపాటలు పిల్లల్లో అధికబరువు తగ్గించటానికి సహకరిస్తాయి. పిల్లాడు ముద్దపప్పులాగా ఇంటిలో కూర్చొని టివిలోని కార్టూన్లు చూడకుండా చక్కటి ప్లే గ్రౌండ్ లో బయట ఆటలాడేందుకు ప్రోత్సహించండి. అరబిక్ వ్యాయామాలైన వాకింగ్, జంపింగ్, రన్నింగ్, సైకిలింగ్, స్విమ్మింగ్ వంటివి ప్రోత్సహించండి.
4. పిల్లాడి ఆహారంలో ఫాస్ట్ ఫుడ్ లేకుండా చూడండి. ఫ్రెంచి ఫ్రైస్, హాంబర్జర్స్, చిప్స్, ఫ్రైడ్ చికెన్, మిల్క్ షేక్స్ మొదలైన కొవ్వు వున్న పదార్ధాలు తిననీయకండి. ఇవన్నీ తర్వాతి దశలో గుండె జబ్బులు తెచ్చే ప్రమాదం వుంది.
5. కార్బన్ కల కూల్ డ్రింకులు పట్టకండి. వీటికి పోషక విలువలు లేకపోగా శరీరానికి కొవ్వు చేర్చే గుణం వుంది.
6. తియ్యగా వున్న డ్రింకులు అంటే జ్యూసులు, ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇవ్వకండి. తక్కువ కొవ్వు వున్న పాలను మాత్రం ఇవ్వండి.
7. తక్కువ కేలరీలు, కొవ్వు వున్న పాల ఉత్పత్తులను ఇవ్వండి.
8. కంప్యూటర్ గేములు, టివి మొదలైన కూర్చుని ఆనందించే వాటిని నియంత్రించండి. పిల్లాడిని ఎపుడూ శారీరక శ్రమ కలిగే ఆటలకు, వెయిట్ తగ్గించే చర్యలకు ప్రోత్సహించండి.
9. లావుగా వున్న పిల్లలు డిప్రెషన్ లో వుంటారు. కనుక వారిపట్ల మీ ప్రేమను, శ్రధ్ధను కనబరచండి, లావు తగ్గేటందుకు చేసే ప్రయత్నాలు తెలుపండి. అతడు మీతో సహకరించి ఉత్సాహంగా పాల్గొనేలా చేయండి.
10. ఎక్కువ సార్లు గా కొద్దిపాటి ఆహారాన్ని ఇస్తూ వుండండి. పిల్లాడు ఆకలితో వుంటే ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలనే ఇవ్వండి. వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ వంటివి పిల్లలకు చాలా మంచిది.



Click it and Unblock the Notifications











