Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
పిల్లల హోం వర్క్ సమస్యగా వుందా?

1. మొదటగా హోం వర్క్ పిల్లాడితో చేయించటం మీరు సమస్యగా భావిస్తున్నారనేది వానికి తెలియజేయకండి. స్కూలుకు వెళ్ళటం, స్నేహితులతో ఆడుకోడం, డిన్నర్ చేయటం ఎలా సాధారణం అనుకుంటాడో అదే విధంగా హోం వర్కు పూర్తి చేయటం కూడానని భావించనీయండి.
2. టి.వి. ధ్వనులు, ఇతరాలు లేకుండా ఇంట్లో అతనికి ఒక ప్రయివేటు స్ధలాన్ని కేటాయించి అక్కడే హోం వర్కు చేయాలని చెప్పండి.
3. పిల్లల స్టడీకి ఇంట్లో కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ సమయం డిన్నర్ కు ముందు లేదా తర్వాత వుండేలా చూడండి.
4. పిల్లవాడి హోం వర్కుకు అవసరమైన స్టేషనరీ, క్రాఫ్ట్ పేపర్ మొదలైనవి అందుబాటులో ఉంచండి. అక్కడే ఒక బుల్లెటిన్ లేదా నోటీస్ బోర్డు కూడా పెట్టి అతను ఏం చేయాలనేది వరుస క్రమంలో రాయండి.
5. పిల్లవాడితో కూర్చొని హోం వర్కు జాబితా చూడండి. ముందు చేయాల్సినవన్నీ బోర్డుపై రాసి వాటిని చేయమనండి. పిల్లవాడు కొంచెం పెద్దవాడైతే ఆ జాబితా బోర్డుపై కూడా రాయమని అడగండి. కొన్ని పనులకు అధిక సమయం కావలసి వస్తుంది. వాటిని వారాంతపు సెలవులలో చేయమనండి.
6. పిల్లవాడు మరీ చిన్నవాడైతే, హోంవర్కు తక్కువగానే వుంటుంది. కనుక అతను చేసటంత వరకు పక్కనే కూర్చోండి. ఇలా కొంతకాలం సాగితే ఇక పిల్లవాడు వాడంతట వాడే హోంవర్కు చేస్తాడు.
7. పిల్లవాడికిగల సమస్యలను గుర్తించండి. లేదా అతను ఎందులో వెనుకబడి వున్నాడో పరిశీలించండి. ఆయా సబ్జక్టులలో అతను కృషి చేసేటందుకు సహకరించండి. దీంతో అతనికి మరల ఆ సబ్జక్టుపై పని చేసేటపుడు విశ్వాసం ఏర్పడుతుంది.
8. పెద్ద పిల్లలైతే వారంతట వారే హోం వర్క్ భాధ్యతను నిర్వహించుకోగలరు. వారు అలా చేయటాన్ని ప్రోత్సహించండి. మీ సహకారం ఏదేనా కావలసి వుంటే అందించండి.
హోం వర్క్ అనేది అదనపు పని కాదని, చదువులో ఒక భాగం అని పిల్లవాడికి తెలియజెప్పండి. ఈ చిట్కాలు ఆచరించి పిల్లలు బాగా చదివేలా చేసి మీరు కూడా తల్లితడ్రులుగా మీ భాధ్యతను నెరవేర్చినట్లు ఆనందపడండి.



Click it and Unblock the Notifications