For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో పెంచండి ....ఏకాగ్రత!

By B N Sharma
|

Improve Concentration In Children – Tips & Suggestions
పిల్లలు టెలివిజన్ చూడటానికి ఎంతోఇష్టపడతారు. అతను తనకిష్టమైన కార్టూన్ ప్రోగ్రాం చూసేటపుడు మాట్లాడించండి. పలకడు. మీరు అతని పేరును రెండు సార్లు పిలవండి. లేదా కొంచెం గట్టిగానే పిలిచి మీ వైపు చూసేలా చేయాల్సి వుంటుంది. అదే విధంగా, అతను చదువుకునేటపుడు పిలవండి. మీరు పిలిచి పిలవగానే అతను మీ వైపుకు దూసుకు వచ్చేస్తాడు. చదువుకునేటపుడు అధిక ఏకాగ్రతతో వుండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. మా పిల్లాడు టివి చూడటంలోని ఏకాగ్రత చదువులో చూపిస్తే ఎంత బాగుండు అనుకుంటారు. ప్రతి తల్లి తండ్రికి పిల్లల ఏకాగ్రత ఒక సమస్యే. కాని పిల్లల ఏకాగ్రత పెంచాలంటే ఎంతో తేలికే! అదెలాగో చూడండి.....!

వృత్తి ఏదైనప్పటికి ఏకాగ్రత ప్రతి ఒక్కరికి అవసరమే. ఇటుకలు తయారీ అయినా...లేక గొప్ప సైంటిస్టు అయినా వారి పనిలో విజయులవ్వాలంటే...ఏకాగ్రత కావలసిందే. మన మనసు చంచలం అన్నది మనందరకు తెలుసు. అయితే, నిరంతర సాధన, నిశ్చితత్వం ల ద్వారా మన మనసును నియంత్రణలోకి తెచ్చి ఏకాగ్రతలను ఏర్పరచవచ్చు. కింద ఇచ్చే చిట్కాలు మీ పిల్లాడి ఏకాగ్రత పెంచటానికి పనికి వస్తాయి. పరిశీలించండి.

1. మొదటగా, పిల్లాడు చదవటానికిగాను ఒక ప్రదేశాన్ని కేటాయించండి. సాధ్యమనుకుంటే, ఒక టేబుల్ మరియు ఛైర్ కూడా అక్కడ వేయండి. లేదా పుస్తకాలు పెట్టుకునేందుకు ఒక డెస్క్, కూర్చుని చదువుకునేటందుకు ఒక మ్యాట్ ఇవ్వండి. స్టడీ చేసే ఆ ప్రదేశంలో ఇకపై తినటం, తాగటం వంటివి చేయకుండా చూడండి.

2. చదువు మొదలుపెట్టే ముందుగా, బుద్ధిగా కూర్చోడం, సరైన పొజిషన్ లోకూర్చోడం చేయాలి. అనవసరమైన చర్యలు అంటే, పెన్సిల్ నమలటం, దిక్కులు చూడటం వంటివి చేయరాదు.

3. ఇతర విషయాలనుండి మైండ్ తప్పించటానికి ఒక్క 15 నిమిషాలు నిశ్శబ్దంగా వుండండి. లేదా ఈ సమయంలో ఒక ప్రార్ధన వంటిది కూడా చేయవచ్చు.

4. ఏ సబ్జక్టు చదవాలనేది నిర్ణయించుకోండి. ఆ సబ్జక్టు తీసుకున్న తర్వాత దానిపైనే కనీసం ఒక గంట కేటాయించండి. తరచుగా సబ్జక్టులు మార్చవద్దు.

5. చదువుకు కూర్చున్న తర్వాత ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. మీ ఇతర పనులు కూడా చక్కబెట్టేయండి. ఆటంకాలు ఎక్కువైతే ఏకాగ్రత దెబ్బతింటుంది.

6. మైండ్ ఎపుడూ చదువుపైనే వుండాలి. అటూ ఇటూ వేరే విషయాలపై ఆలోచించరాదు. వ్యతిరేక ఆలోచనలు వద్దు. అధికంగా భుజించి కూర్చోవద్దు. ఇలా చేస్తే మీ మైండ్ చాలా చురుకుగా వ్యవహరిస్తుంది.

7. మీపై మీకు విశ్వాసం వుండటం ప్రధానం. అది ఏకాగ్రతకు బాగా సహకరిస్తుంది. చదువు అంటే ఇష్టపడాలి. మీరు ఇష్టపడితే తప్ప, ఆ పనికి మీరు అంకితమవ్వలేరనేది గుర్తుంచుకోవాలి.

చెప్పిన ఈ చిట్కాలన్నీ ఒక్క రోజులో ఆచరించాల్సిన పనిలేదు. అయితే ఒకటొకటిగా ఆచరిస్తూ చదవటం నేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. పిల్లలలో ఏకాగ్రత లేకపోవటమనే సమస్య సగం తీరినట్లే.

English summary

Improve Concentration In Children – Tips & Suggestions | పిల్లల్లో పెంచండి ....ఏకాగ్రత!

Children love to watch television. Try talking to your child when he is watching his favorite cartoon. You'll have to call out his name a couple of times or maybe even prod him a little to gain his attention. Call him out when he is studying. He'll be at your service in no time, probably even before you have finished calling out his name. 'If only my child would concentrate more while he is studying!'.
Story first published:Tuesday, September 27, 2011, 12:55 [IST]
Desktop Bottom Promotion