Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలకు టి.వి. యే లోకంగా వుందా?

- పిల్లలు టి.వి. చూసే అలవాటును పెద్దలనుండే నేర్చుకుంటారు. పిల్లలు గొడవచేస్తూంటే తల్లితండ్రులు వారికి లంచంగా టి.వి. ముందు కూర్చోపెడతారు. తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఇక పిల్లాడికి టివి యే టైమ్ పాస్ గా వుంటుంది. కనుక ఇకపై మీ ఫ్రీ టైమ్ పిల్లలతో గడపండి. కనీసం మీరు పిల్లాడి దగ్గర వున్నపుడు టి.వి. కట్టేయండి.
- డిన్నర్ టైమ్ లో టి.వి. ఆన్ చేయకండి. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా టేబుల్ వద్ద కూర్చొని ఆరోజు సంగతులు మాట్లాడుకోండి.
- వీలైతే, లివింగ్ రూమ్ లో వున్న మీ టెలివిజన్ బెడ్ రూమ్ లోకి మార్చండి. దీనివలన రోజంతా వారు కూర్చునే లివింగ్ రూమ్ లో టి.వి. వుండదు కనుక తక్కువగా చూస్తారు. ఇక వేళ వారు బెడ్ రూమ్ లో చూసినప్పటికి మీ నియంత్రణ వుంటుంది.
- ఛైల్డ్ లాక్ తో టి.వి.లో కొన్ని హింసాత్మక సినిమాల ఛానెల్స్ బ్లాక్ చేయండి. వాడికి ఆసక్తి కొంతవరకు తగ్గుతుంది.
- పిల్లల బెడ్ రూమ్ లో టెలివిజన్ పెట్టవద్దు. టి.వి. వారి స్టడీస్ అశ్రధ్ధ చేసేలా చేస్తుంది.
టి.వి. కి అలవాటు పడిన పిల్లాడు, బయటకు వెళ్ళి నలుగురిలో కలిసి ఆడుకోక, చురుకుదనం పోయి మెత్తగా తయారవుతాడు. మీ పిల్లాడు టివికి బాగా అలవాటు పడిపోతే, ఇక వాడి మైండ్ మళ్ళించటానికి ఏదైనా క్రీడలలో ప్రవేశపెట్టాలి. మ్యూజిక్, డ్యాన్స్ లేదా ఆర్ట్ లేదా స్విమ్మింగ్, స్కేటింగ్ వంటివి వారిలో మంచి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి.
ఈ చిట్కాలు పాటించి మీ పిల్లాడిని అతిగా టి.వి. చూసే అలవాటును మాన్పించండి.



Click it and Unblock the Notifications