Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ బిడ్డ అబద్ధాలు చెప్పేస్తున్నాడా?

అసలు పిల్లలు ఎందుకు అబద్ధాలు చెపుతారు?
మీ పిల్లాడు చిన్నవయసు వాడు కాబట్టి సిల్లిగాఆడేస్తున్నాడు అనుకుంటే అది సరికాదు. పిల్లలు మీకంటే తెలివైనవారు. వారు ఏం మాట్లాడుతునన్నారనేది వారికి ఖచ్చితంగా తెలుసు. అబద్ధాలు చెపటమనేది ఒక అలవాటు. దానికి వయసుతో సంబంధం లేదు. అది మీ పిల్లాడి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుపుతూంటుంది. మీ విశ్లేషణ మీ పిల్లాడు ఏ రకమైన అబద్ధాలు చెపుతున్నాడనేదానిపై ఆధారపడి వుంటుంది.
ఒక్కొక్కపుడు పిల్లలు నిజం చెప్పటానికి భయపడతారు. వారు ఏదైనా తప్పు చేశామనుకుంటే, వారు దండించబడతారనుకుంటే, అందుకు భయపడి అబద్ధం చెప్పేస్తారు. ఉదాహరణగా...మీ కిష్టమైన నెయిల్ పాలిష్ బాటిల్ ఆటలో ఒలక పోశారు, లేదా ముఖ్యమైన పత్రాలు పాడుచేశారు ఇక వారికి దండన తప్పదని భావించి చేయలేదని అబద్ధం చెప్పేస్తారు. అయితే, తప్పు చేశామన్న భావన వారి ముఖాలలో మీరు తప్పక చూడవచ్చు.
సరే, ఇక కారణం తెలిసింది. అయితే మీరు అంతటితో వదిలేయకండి. చిన్నపాటి శోధన చేయాలి. ఇది వారిపట్ల మీరు కఠినంగా వున్నారని శిక్షిస్తారని వారికి తెలుస్తుంది. సరైన కారణాలు లేకుండా మీ బిడ్డ అబధ్ధమాడేస్తూంటే, అతనికి అసలు భయం లేదన్నమాట. స్కూల్లో ఏం చేశావ్ అని మీరడిగితే, వేరే గ్రహం నుండి ఒక వ్యక్తి వచ్చాడని వాడు అక్కడ తిరుగుతుంటే చూశానని అతను చెపుతే, వాడి ఊహాగానాలు కధలుగా మీకు చెప్పేస్తున్నాడన్నమాట. అది పూర్తి అబద్ధమని మీకు కూడా తెలుసు.
మరి ఇక మీ పిల్లాడు ఇదే విధంగా పెద్దవాడైన తర్వాత కూడా కధలు చెపుతూంటే ఇక అబద్ధాలాడటానికి అలవాటు పడిపోయాడన్నమాటే. అనవసరమైన విషయాలకు కూడా అతడికి ఎల్లపుడూ నోటివెంట అబద్ధాలు తప్పనిసరిగా వచ్చేస్తూనే వుంటాయి. ఈ తప్పని సరి అబద్ధాలను లేదా అనవసర అబద్ధాలను మాన్పించటానికి మీ పిల్లాడికి....కధలు చెపటం మంచిదే కాని ప్రశ్న అడిగినపుడు సరి అయిన సమాధానం ఇవ్వటం చేయాలని వివరించాలి. ఊహలతో కధలు చెపటానికి వాస్తవానికి తేడా వుంటుందనేది వాడికి వివరించి చెప్పాలి. పిల్లలు ఎందుకు అబద్ధమాడతారనేది ఇక మీకు తెలుసుగనుక, వారిని సరిదిద్దటంలో తేలికగా వ్యవహరించండి.



Click it and Unblock the Notifications