For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ సురక్షితంగా గడిస్తే... !

By B N Sharma
|

Parent
టీనేజ్ హార్మోన్లు అధికమవుతున్న దశలో పిల్లలను పర్యవేక్షించే ప్రక్రియ ఎంతో కష్టంగా వుంటుంది. టీనేజ్ సురక్షితంగా గడిస్తే, జీవితమంతా బాగుంటుంది. టీనేజ్ లో ఏ మాత్రం తప్పు దోవ పట్టినా, జీవితం దుఖా:న్నిస్తుంది. కనుక ఇంతటి ప్రధానమైన టీనేజ్ లో సరైన మార్గదర్శకతలను అన్నివిధాలా అందించడం తల్లితండ్రులుగా మీ భాధ్యత. మీ టీనేజ్ లో కండోమ్ గురించి మాట్లాడటం వుండేదికాదు. కాని నేటి మీడియాలోకంలో ముద్దులు సైతం సర్వసాధారణమయ్యాయి. కనుక టీనేజ్ పిల్లలకు సరైన జీవిత విలువలు బోధిస్తూనే, తల్లితండ్రులు గర్భనిరోధక సాధనాలపై కూడా కొంతమేర అవగాహన అందించాలి. అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి.

అన్నిటికంటే ముందు మీ టీనేజ్ బిడ్డతో మీరు మంచి అవగాహన కలిగి మీరు వారి బాగు కొరకే శ్రమిస్తారనే నమ్మకం ఏర్పరచండి. అపుడే మీరు తెలిపే విషయాలు మీ బిడ్డ విశ్వసిస్తుంది. ఇటీవలే మీ టీనేజ్ పిల్లతో మీరు గందరగోళం పడ్డారా? ఖంగారు పడకండి. ఆమెను ఒకసారి మనసారా కౌగలించుకోండి. మరోమారు ఆమెలో మీ పట్ల విశ్వాసం పెంచండి. ఇక చిట్కాలు మొదలు పెట్టండి.

మీ టీనేజి పిల్లలకు ఒకే సారి సడన్ గా 'కండోమ్ ఉపయోగించు' అని చెప్పకండి. అవాంఛనీయ సంఘటనలు వివరించండి. టీనేజ్ లో ప్రెగ్నెన్సీ లు కోరదగినవి కావని, అబార్షన్లు తెలివైన పిల్లల జీవితాలు నాశనం చేస్తాయని తెలుపండి. సున్నితమైన ఈ సమస్యకు మీ చిన్నారి కొంత అలవాటుపడాలి.

తల్లితండ్రులలో తల్లి ఈ విషయాలను కుమార్తెకు, తండ్రి కుమారుడికి వివరిస్తే బాగుంటుంది. సాధారణంగా ఈ కాంబినేషన్లతోనే ఇట్టి వ్యవహారాలు కూడా జరుగుతూంటాయి.

ఈ విషయాలు తెలిపినంత మాత్రాన వారికి సెక్స్ పరంగా లైసెన్స్ ఇచ్చేసినట్లు వారూ లేదా మీరూ కూడా భావించరాదనేది గ్రహించాలి. ఒక వేళ ఏదైనా జరగాల్సి వుంటే అది సుక్షితం అని తెలుపాలి. టీనేజి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే కంటే ఒక టీనేజ్ చిన్నారికి కండోమ్ లు కొనటం అతి తేలిక. నయం చేసుకునేకంటే నిరోధించటం మేలని తెలుపాలి.

ఈ సున్నిత మైన గర్భనిరోధక సాధనాలగురించి చెపటానికి మీరు సిగ్గుపడేకంటే, ప్రియమైన మీ బిడ్డ భవిష్యత్తుమీకు ప్రధానం అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ బిడ్డ దానికి సిగ్గుపడుతూంటే, పెద్దవారయ్యారు కనుక ఇటువంటివి తెలుసుకోడం తప్పులేదని చెప్పాలి.

ఈ చిట్కాలతో మీ టీనేజర్లకు గర్భనిరోధకతలు, సురక్షిత ప్రేమలు బోధించండి.

English summary

Parenting Teenagers on Contraception? | టీనేజ్ టార్చ్ లైట్... !

Parenting teenagers, especially when their hormones are kicking could be the most difficult part of your parenting process. Teenage is a time that if passed safely can result in a fruitful life and if gone astray can lead to a lifetime of trouble. To guide your child through such a precarious time is your biggest duty. Things are changing and we must change with it.
Story first published:Monday, December 5, 2011, 10:49 [IST]
Desktop Bottom Promotion