Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టీనేజ్ ఒత్తిళ్ళు....పేరెంట్స్ సమస్యలు!

అన్నిటికంటే ముఖ్యమైంది, నేటి వేగవంత జీవనంలో వారికి గల ఒత్తిడిని తొలగించటానికి మీరు కొన్ని చర్యలు చేపట్టవలసి వస్తుంది. మీరు తీసుకునే చర్యలు లేదా వారిపై పెట్టే ఆంక్షలవంటివి వారికి ఆశావహంగా వుండి వారిలో ఉత్సాహాన్ని కలిగించాలి. ఒత్తిడి కారణంగా పిల్లలు బెడ్ వెట్టింగ్ వంటి చర్యలకు కూడా గురవుతారు. ఇండ్లలో నేడు ప్రతిరోజూ టీనేజ్ పిల్లలకు, వారి తల్లితండ్రులకు మధ్య వాగ్వివాదాలు జరుగుతున్నాయి. కొన్ని సమయాలలో అవి మరింత అధికమవుతున్నాయి కూడాను.
అదేరకంగా పిల్లల మధ్య కూడా విభేదాలు పొడచూపుతాయి. మొదటగా ఈ రకమైన భేధాభిప్రాయాలు తప్పక వుంటాయని తల్లితండ్రులు నిర్ధారించుకోవాలి. పిల్లల ఎదుగుదలను ఆపలేమని కూడా తెలుసుకోవాలి. ఒక అడుగు మీరే వెనక్కు వేసి వారి ఎదుగుదలను, వారిలో ఏర్పడే అభిప్రాయాలను గమనించండి. వారిలో ఒక ఖచ్చితమైన సరికొత్త వ్యక్తిత్వాలు అభివృధ్ధి చెందటాన్ని మీరు గమనించగలరు. ఇక ఆ సమయంలో వారికి అర్ధమయ్యే రీతిలో వివరంగా సంబంధిత సమస్యలను చర్చించి ఇంటిలో ప్రశాంతవాతావరణానికి దోహదపడండి.



Click it and Unblock the Notifications