Latest Updates
-
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్! -
జూన్ 1, 2026: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో తిరుగులేని విజయాలు మీ సొంతం! -
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. -
సోషల్ మీడియాలో రాజయోగం పేరుతో హడావుడి.. ఈ రాశుల వారికి నిజంగానే అదృష్టం ఉందా? -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే మటన్ ఊరగాయ.. ముక్క తగిలితే మజానే! -
ఈ 7 దేవాలయాల్లో శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగే అద్భుత సంఘటనలు శాస్త్రవేత్తలు కూడా నిరూపించలేకపోయారు -
జూన్ 1, 2026: గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం.. రాహుకాలం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వృశ్చికం, కర్కాటక రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 01 జూన్ 2026
మగబిడ్డను సగర్వంగా పెంచండి!

సాధారణంగా పిల్లలకు 10 సంవత్సరాలు వచ్చేటంతవరకు ఆడైనా, మగైనా పెంపకం తీరు ఒకటిగానే వుంటుంది. ఏదైనా తేడా వుంటే బహుశ అది వారి ఆటబొమ్మలలో కావచ్చు. 13 లేదా 14 సంవత్సరాలు వచ్చాయంటే, ఇక మగ పిల్లాడు యౌవన దశకు చేరతాడు. ఇక అప్పటినుండి పిల్లాడిని విభిన్నంగా వ్యవహరించాల్సివుంటుంది. పిల్లలు మగవారవటంచేత వీరి శారీరక కదలికలు అధికంగా వుంటాయి. వీరు బయట ఆటలాడటం, దెబ్బలు తగిలించుకోడం వంటివి కూడా చేస్తారు. అంతమాత్రం చేత వీరిని నిరుత్సాహపరచరాదు. కాని సన్నిహితంగా పరిశీలించాలి.
ఆటలాడితే పరవాలేదు. కాని అదే సమయంలో వారు చదువు మానరాదు. అయితే, వారు ఏ విషయంలోనైనా దురుసుగా లేదా హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటే మాన్పించాల్సిందే. పిల్లాడు పోట్లాడుతుంటే దానిని సరిచేయాల్సిందే. కొంతమంది తల్లి తండ్రులు తమ కుమారుడి దురుసు ప్రవర్తనను గొప్పతనంగా భావిస్తారు. అది వారిని కాపాడుతుందనుకుంటారు. అయితే ఆ ప్రవర్తన అతను ప్రతి ఒక్కరిపైనా ప్రదర్శిస్తాడని, చివరకు తమపై కూడా ఏదో ఒకనాడు చూపుతాడని భావించరు. కనుక బయట మీ పిల్లలు దురుసుగా ప్రవర్తిస్తుంటే అది మాన్పించండి.
ప్రతి కుటుంబంలోను పిల్లవాడిని తండ్రి క్రమశిక్షణ చేస్తే, తల్లి పిల్లాడిని స్నేహితుడుగాను, తల్లి కట్టడి చేస్తే తండ్రి పిల్లాడిని స్నేహితుడుగాను చూడాలి. మగపిల్లలు తల్లికి సన్నిహితంగా వుంటారు. కనుక తల్లి కఠినంగా వుండి తండ్రి తేలికగా వుండాలి. పిల్లల్ని బాగాపెంచాలంటే ఇది మంచి పద్ధతి. ఎదిగే మగ పిల్లలకు అపుడపుడూ శారీరకంగా కొన్ని శిక్షలు కూడా వేయాల్సిందే. అనేది పాతకాలంనాటిమాట. కాని నేడు వీరి క్రమశిక్షణకు చిట్కాలు మారాయి. మీరు కనుక పిల్లవాడిని కొడితే, అతను నేటి రోజుల్లో మరింత మొండిగాను, దురుసుగాను తయారవుతున్నాడు. ఒక దశ తర్వాత అతనికి భయం కలగటం లేదు. అతనికి ఏ శిక్ష వేసినా అతను గాయపడకుండా అవమానిస్తే చాలు. అదే మీ చేతుల్లో వున్న ఆయుధం. దానితోనే అతను తన తప్పును గ్రహించే స్ధితికి వస్తాడు.
గర్వంగా భావించే మీ కుమారుడిని పెంచటానికి ఈ చిట్కాలుపయోగించండి.



Click it and Unblock the Notifications