For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కదలిక లేకుంటే కష్టమే మరి!

By B N Sharma
|

Remedies To Cure Constipation In Kids
పిల్లలు మలబద్ధకంతో బాధపడటం ఒక సాధారణ సమస్య. కడుపులో కదలికలు సరిలేకుంటే మలం గట్టిపడుతుంది. బయటకు రావటం కష్టమవుతుంది. అందుకు పరిష్కారాలు చూద్దాం.

ఆహారం - పిల్లల ఆహారంలో నీటిలో కరిగే పీచు పదార్ధాలు చేరిస్తే మలబద్ధకం పోతుంది. అందుకుగాను, పప్పులు, ధాన్యాలు, తాజా కూరలు, పండ్లు, నీరు తగినంతగా ఆహారంలో చేర్చాలి. ఆపిల్, పపయా వంటి పండ్లు తినిపిస్తే, ఇవి పిల్లలలో వచ్చే మలబధ్ధకాన్ని నివారిస్తాయి. ఇవి తినటానికి వారిని ప్రోత్సహించండి.

ద్రవ ఆహారాలు - తాగే పాలు కాకుండా ప్రతి పిల్లాడు రోజుకు 960 మిల్లి లీటర్ల నీరు తాగాలి. మలం లూజు అవ్వాలంటే పండ్ల రసాలు, నీరు ఇవ్వండి. పాలు మలబద్ధకాన్ని కలిగిస్తాయి.

శరీర కదలికలు - పిల్లాడు ఆటలాడటానికి ప్రోత్సహించండి. ఆటల తర్వాత ద్రవ ఆహారాలను అధికంగా ఇవ్వండి. పార్కులు, ఆట స్ధలాలుకు తీసుకు వెళ్ళండి.

ఒకే సమయం పాటించండి - పిల్లాడు ప్రతిరోజూ ఒకే సమయానికి టాయ్ లెట్ కు వెళ్ళేలా అలవాటు చేయండి. టాయ్ లెట్ లో 5 నుండి 10 నిమిషాలు గడిపేలా చేయండి. సాధారణంగా పిల్లలు ఉదయం వేళ పొట్టలోకి ఆహారం తిన్న తర్వాత టాయ్ లెట్ వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. ఈ అలవాటుకు వారిని ప్రోత్సహించండి.

English summary

Remedies To Cure Constipation In Kids | కదలిక లేకుంటే కష్టమే మరి!

Kids suffering from constipation is a common health problem. Constipation is a common disturbance in the digestive tract which leads to difficulty in passing stool. The bowel movements is not regular and the stool becomes hard.
Story first published:Thursday, October 20, 2011, 12:22 [IST]
Desktop Bottom Promotion