For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకు ఆరోగ్యపుటలవాట్లు నేర్పించండి!

By B N Sharma
|

toddler
ఒక తల్లిగా మీ బిడ్డ ఆరోగ్యపుటలవాట్లను గమనించటం చాలా కష్టమైన పని. పిల్లలు ఎన్నో రకాల అనారోగ్యపు చర్యలను

చేపడతారు. జబ్బులు పడతారు, అనవసరమైన వైద్య ఖర్చులు చేయిస్తారు. కనుక పిల్లలకు సరైన ఆరోగ్యపుటలవాట్లు ఎలా

నేర్పించాలి, వారు క్రిములకు, వ్యాధులకు గురికాకుండా వుండేలా వారికి ఎలా తెలియజెప్పాలి అనేది పరిశీలిద్దాం!

1. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటం - 2 లేదా 3 సంవత్సరాల పిల్లలకు చేతులు కడుక్కోవటం తెలియదు. తల్లితండ్రులు వారికి

భోజనానికి ముందు, తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవటాన్ని నేర్పించాలి. అరచేతులు ఒకదానికొకటి వేసి ఎలా రుద్దాలి?

వేళ్ళమధ్య ఎలా శుభ్రం చేసుకోవాలి, మొదలగు ప్రాధమిక శుభ్రతా చర్యలు వారికి నేర్పించాలి.

2. దుస్తులు మార్పు - ఆటాలాడి వచ్చిన తర్వాత లేదా పడుకునేటపుడు పిల్లలకు దుస్తులు మార్పు చేయటం మంచి

అలవాట్లలో ఒకటి. రోజంతా ఆడుకునే సమయంలో దుస్తులకంటిన క్రిములు బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కనుక రాత్రి

పడుకునే ముందు దుస్తులు మార్చి కాళ్ళు, చేతులు, ముఖం బాగా కడుగుకునేలా వారికి తెలియజెప్పాలి. దీనితో సగం

అనారోగ్యం వెనుకబడినట్లే.

3. టాయ్ లెట్ కు వెళ్ళినపుడు వారంత వారే ఎలా శుభ్రం చేసుకోవాలి? బేసిన్ లో ఫ్లష్ ఎలా చేయాలనే విషయాలు వారికి

తెలియజెప్పి వారితో చేయించాలి.

4. దంతాల శుభ్రత - దంతాలు బ్రష్ తో ఏ రకంగా శుభ్రం చేసుకోవాలి, చిగుళ్ళ జాగ్రత్త, నాలిక శుభ్రం చేయటం వంటివి చేస్తే,

తగినంత నోటి శుభ్రత వారికి చిన్న తనం నుండే ఏర్పడుతుంది.

5. స్నానం చేయటం - సోప్ ఎలా శరీరానికి రాయాలి, షాంపూతో తల వెంట్రుకలు ఎలా శుభ్రం చేయాలి అనేది తెలియజెప్పాలి.

అదే సమయంలో నీరు వృధా చేయరాదనే విషయం కూడా వారికి తెలియజేయాలి.

6. పేపర్ టవల్స్ ఎలా ఉపయోగించాలి? వాటిని ఎలా పారవేయాలనేది కూడా తెలియజెప్పాలి. ఈ అంశం శుభ్రతలే కాదు

పిల్లాడికి మేనర్స్ కూడా తెలిపినట్లవుతుంది. అదే విధంగా స్పూను, నేప్ కిన్స్, కర్చీఫ్, పేపర్ టవల్స్ మొదలైన వాటి

వినియోగం, పారవేయటం తెలుపాలి.

పిల్లలకు చిన్నతనంలోనే శుభ్రతలు చక్కగా నేర్పిస్తే, భవిష్యత్తులో వారికి ఈ అలవాట్లు ఎంతో మేలు చేస్తాయి.

English summary

Teaching Hygiene For Kids! పరిశుభ్రత పాటించటం మేనర్స్ కూడాను!

Using And Discarding Paper Towels – Parents need to take the teaching hygiene for their brood seriously as it is not just a matter of cleanliness but also manners. They need to know about the usage of spoon, napkins, kerchiefs, paper towels and the way to discard them.
Story first published:Saturday, October 8, 2011, 12:38 [IST]
Desktop Bottom Promotion