For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటింగ్ పిల్లలు...డౌటింగ్ పేరెంట్స్!

By B N Sharma
|

Teenagelove
టీనేజర్లు డేటింగ్ పై మాట్లాడితే అది సీరియస్ గానే తీసుకోవాలి. టీనేజర్ల జీవితం అయోమయంగా వారికనిపిస్తూంటుంది. ఏం చేయాలో, ఏం చేయకూడదో వారికి తెలియదు. మీ టీనేజర్ డేటింగ్ మొదలు పెట్టిందంటే మీ చేయి దాటిందని గుర్తుపెట్టుకోండి. కనుక వారిని జాగ్రత్తగా కనిపెట్టివుండాలి. ఆమె యుక్త వయసుకు వచ్చిందంటే, తల్లితండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలి. శరీరంలో హార్మోన్ మార్పులు వచ్చి టీనేజర్ ఎంతో ఒత్తిడిగా వుంటుంది. తన పార్టనర్ తో ఎలా కలుద్దామా? ఎపుడు కలుద్దామా అన్న ఆత్రుతతో వుంటుంది. యుక్త వయసు వచ్చిన కుమార్తె వుంటే, తల్లితండ్రులు దిగువ నిబంధనలు పాటించండి.

1. వయసు
- టీనేజ్ కుమార్తెలు అదే ఏజ్ వున్న పిల్లాడితో డేట్ చేయాలని దానివలన వారి సంబంధంలో వ్యత్యాసాలు పెద్దగా వుండవని తల్లితండ్రులు భావిస్తారు. అది సరైనదే. పిల్లాడు కూడా అదే వయసు కావడంతో ఆమెను చెడుగా వినియోగించటం జరగదు.

2. నిద్ర - మీ టీనేజ్ కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తూంటే, మరల ఇంటికి ఎపుడు వచ్చేది తెలుసుకోండి. వీలైనంత వరకు బయట నిద్రపోకుండా కూడా చేయండి.

3. వివరాలు - మీ టీనేజ్ కుమార్తె డేటింగ్ చేసే పిల్లాడి పట్ల తల్లితండ్రులు అన్ని విషయాలు తెలుసుకొని వుండాలి. ఆ పిల్లాడు మీ కుమార్తెకు తగిన వాడా కాదా అనేది కూడా నిర్ణయించాలి. ఈ అంశాలు వారు ఎలా ప్రవర్తిస్తున్నారనేది కూడా తెలుపుతాయి.

4. నిబంధనలు - తల్లి తండ్రులు తమ టీనేజ్ పిల్లలకు సురక్షితమైన డేటింగ్ గురించి తెలుపాలి. టీనేజ్ గర్భవతులు నేటి రోజులలో అధికమవుతున్నారు. కనుక డేటింగ్ నిబంధనలు తల్లి తండ్రులు తమ కుమార్తెలకు తప్పక తెలపాలి.

టీనేజ్ డేటింగ్ అనేది ప్రస్తుతం సాధారణమై జీవితంలో ఒక భాగమైంది. కనుక మీ టీనేజ్ కుమార్తెకు డేటింగ్ నిబంధనలు, దాని వలన కలిగే ఫలితాలు పూర్తిగా తెలుపండి.

English summary

Teenage Dating Rules For Teenage Daughters! | టీనేజ్ డేటింగా? కొంప కొల్లేరే!!

Dating can be a serious issue when it comes to teenagers. The life of a teenage is really confusing and at this point of time when your teenager begins to date things can get out of hand, if you do not watch carefully. Teenage dating is something which is common and part of life. Make it essential that your teenage daughter knows the dating rules and the consequences set by you if you insist on any.
Story first published:Tuesday, November 22, 2011, 17:34 [IST]
Desktop Bottom Promotion