Latest Updates
-
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం!
కత్తెర వేస్తే....చూడముచ్చట!

పిల్లాడు భయపడి గొడవ చేస్తూ వుంటే...మీరు మాత్రమే బాగా నియంత్రించగలరు. పిల్లలకు కూడా ఎలా పడితే అలా హెయిర్ కట్ చేయటానికి వీలులేదు. వారికి కూడా బాబ్, లేయర్స్, బౌల్ కట్ మొదలైనవి వున్నాయి. అయితే, మీరు పిల్లాడికి ఇంటివద్దే మీరు చేసేయాలనుకుంటే, ఎలా చేయాలో చూడండి.
హెయిర్ కట్ కు అవసరమైన వస్తువులు - ఒక చిన్న టవల్, చిన్న సైజు కత్తెర, సన్నని దువ్వెన, తడి చేయటానికి నీరు ఒక స్ప్రేయింగ్ కేన్ లో, అద్దం, హెయిర్ క్లప్పులు. వీటితో పాటు అదనంగా ఒక టివి లేదా ల్యాప్ టాప్ వంటివి వుంటే కూడా పిల్లాడు కదలకుండా కూర్చుంటాడు.
పిల్లాడిని భయపెట్టకండి - ఇదే మొదటిసారైతే, వాడికి మీరు చేసే పని వివరించండి. సరదాగా వుంటుందనండి. ఒకే సారి ఎపుడూ సడన్ గా బార్బర్ ఛైర్ లో వాడిని కూర్చోపెట్టకండి.
హెయిర్ కట్ కు సిద్ధం చేయండి - భుజం చుట్టూ టవల్ కప్పి టివీలో కార్టూన్ సినిమా చూపిస్తూ కూర్చోపెట్టండి. స్ప్రేయర్ తో నీటిని తలపై చల్లండి. లేదా దువ్వెన తడి చేసి వెంట్రుకలు సగానికి దువ్వండి. లేదా ముందుకు, వెనక్కు పూర్తిగా దువ్వండి. తలపై నీరు చల్లితే కొంతమంది పిల్లలు ఏడుస్తారు. జాగ్రత్త.
పిల్లాడి దృష్టి మరల్చండి - కత్తెర ధ్వని, వెంట్రుకలు తెగి కిందపడటం వంటివి పిల్లాడిని భయపెడతాయి. అందుకని కార్టూ న్ సినిమా చూపించి మెల్లగా మీ పని మీరు చేయండి.
కటింగ్ ఎలా చేయాలి? - తల వెంట్రుకలు ముందు, వెనుక, పక్క భాగాలుగా గుర్తించి ఒక్కొక్క భాగం ఒకోసారి దువ్వుతూ చేయాలి. చేస్తున్నంత సేపూ పిల్లాడు కార్టూన్ సినిమా చూస్తూనే వుండాలి.
మీరు చేసే పని తేలికగా వుందనుకుంటే, ఇక పిల్లాడు ఏ అభ్యంతరం చెప్పక చక్కని హెయిర్ కట్ కు సహకరిస్తాడు.



Click it and Unblock the Notifications