Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అంబరాన్నంటే సంబరాల దీపావళి!

1. పిల్లలు అందమైన డ్రస్ లు వేసుకుంటే అందరికి ఆనందమే. అయితే ఆ ఆనందం అలానే వుండాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాలీయస్టర్, సిల్క్ మొదలైనవి తేలికగా మంటలను అందుకుంటాయి. అందుకని ఈ పండుగకు వారికి మరో జత కాటన్ దుస్తులు కొనండి. సాయంత్రమయ్యే సరికి టపాసులు కాల్చటానికి సిద్ధమయ్యే పిల్లలకు కాటన్ దుస్తులు వేస్తే వారు వెలిగించే ఫైర్ వర్క్స్ తో మీకు ఎటువంటి సమస్యా రాదు.
2. పిల్లలకు పొడవైనవి, బాగా లూజుగా వుండే దుస్తులు వేయవద్దు. టపాసులు కాల్చటం కష్టం కూడా అవుతుంది. పూజ సమయంలో ఏ దుస్తులు ధరించినప్పటికి, సాయంత్రమయ్యే సరికి బిగువుగా వుంటే ప్యాంటు, షర్టు వంటివి వేయండి. వీటితో పిల్లలు టపాసులు కాల్చటం తేలికవుతుంది.
3. పిల్లలకు అన్ని రకాల టపాసులు ఇవ్వవద్దు. ప్రత్యేకించి పేలే టటువంటి టపాకాయలు వారికి సురక్షితం కాదు. అందుకని స్పార్క్ లర్స్ మాత్రమే ఇచ్చి వారిని ఆనందింపజేయండి. వారు ఒంటిరిగా కాల్చకుండా పెద్దవారి సమక్షంలో కాల్చేలా చేయండి. టపాసులు నాణ్యతగలవిగా ఎంపిక చేసి లైసెన్సులు కల డీలర్ల వద్ద మాత్రమే కొనండి.
4. పిల్లలకు టపాకాయలు చూస్తే ఎంతో ఉత్సాహం. ఈ ఉత్సాహంలో జాగ్రత్తలు మరచిపోతారు. కనుక ప్రతి టపాకాయను ఎలా పేల్చాలో వారికి తెలియజేయండి.
5. టపాసులు కాల్చే ప్రదేశం కూడా సరైనదై వుండాలి. రోడ్డు మధ్యలో లేదా ఇంటి లోపల, గుంపులు వున్న చోట కాల్చవద్దని పిల్లలకు తెలియజెప్పాలి.
ఈ జాగ్రత్తలను పాటించి దీపావళి పండుగను హాయిగా, ఆనందంగా జరుపుకోండి.



Click it and Unblock the Notifications