Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పిల్లల త్రాగుడు (అల్కహాల్)...పెద్దల నిర్లక్ష్యం!

ఇంగ్లాండ్ లోని తల్లి తండ్రులు వయసురాని తమ పిల్లలు త్రాగుడుకు అలవాటు పడుతున్నా పట్టించుకోడం లేదట. త్రాగుడుకు అలవాటు పడితే వచ్చే హాని కర పరిస్ధితులపై అక్కడి తల్లితండ్రులను హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్ తాగటం తమ పిల్లల భధ్రతకు పెద్ద అడ్డంకి కాదని వారు భావిస్తున్నారట.
తల్లి తండ్రులు, తమ వయసు పరిపక్వత చెందని పిల్లలు ఆల్కహాలు తాగటం, దానివలన వచ్చే దుష్ప్రభావాలను ఎదుర్కొనటంపై, పూర్తి అవగాహన కలిగి వుండాలని, ఆదేశంలోని ఛిల్డ్రన్స్ కార్యదర్శి ఎడ్వర్డ్ బాల్స్ హెచ్చరించారు.
క్రమం తప్పకుండా తాగేస్తున్న విద్యార్ధులు తమ స్కూలు చదువులలో ఎంతో వెనుక పడటం, రోడ్లపై ట్రాఫిక్ యాక్సిడెంట్లలో చిక్కుకోవడం లేదా సురక్షితం కాని లైంగిక సంబంధాలకు అలవాటు పడటం వంటివి కూడా చేస్తున్నారని తెలిపారు. తల్లితండ్రులు మొదటగా తాగటం వలన వచ్చే హానికర ఫలితాలను తాము తెలుసుకొని తర్వాత వయసు పరిపక్వతలేని వారి పిల్లలు తాగుడుకు అలవాటుపడకుండా చూడాలి.
త్రాగుడు మితిమీరితే పెద్దలైనప్పటికి నష్టాలకు గురికాక తప్పదు. పాశ్చాత్య దేశాలలో వాతావరణ పరిస్ధితుల దృష్ట్యా బహుశ వైద్య పరంగా కూడా కొద్దిపాటి ఆల్కహాలుకు వైద్యులు సలహా ఇస్తూనే వుంటారు. కాని చిన్నవయసులోనే ఇటువంటి అలవాట్లకు బానిసైతే, జీవితాంతం వాటి పరిణామాలు పిల్లలు అనుభవించక తప్పదు.



Click it and Unblock the Notifications