Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లవాడికి డబ్బు విలువ తెలుపటమెలా?

1. పిల్లవాడికి 18 సంవత్సరాలు వచ్చాయంటే, వానిని మీ ఆర్ధిక సమస్యల చర్చలలో భాగస్వామిగా చేర్చండి. కుటుంబ ఆర్ధిక స్ధితి, కొనుగోలు నిర్ణయాలు అతనికి తెలియాలి. మీ బడ్జెట్ ను వానికి తెలిసేలా వుంచండి. మీ బిల్లులు, అవసరాలకు మనీ ఎలా ఖర్చు అవుతోందో బాలుడు గ్రహిస్తాడు.
2. మీ శక్తికి తగిన వాటిని అతనికి తెలియచేయండి. బాలుడికి సంబంధించిన ఆర్ధిక అంశాలపై ఉమ్మడి చర్చ చేయండి. అన్ని వివరాలు తెలియకపోయినా మీరు మనీ వృధా చేయలేరన్న విషయం వాడికి తెలియాలి.
3. డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కష్టమని కనుక పొదుపు చేయాలని నేర్పించండి.
4. పిల్లవాడి గదిలో ఒక పిగ్గీ బ్యాంక్ ను వుంచండి. వారానికి లేదా నెలకు అతనికి ఇచ్చే డబ్బులో కొంత పొదుపు చేసేలా చూడండి. వానికి పిగ్గీ బ్యాంక్ బోర్ కొట్టేస్తే ఆసక్తి పెంచటానికి మరో బొమ్మను కొని ఇవ్వండి.
5. అపుడపుడూ షాపింగ్ చేయించండి. బిల్లులు లెక్కవేయడం కొన్న వస్తువు ప్రాధాన్యతను గుర్తించడం నేర్పించండి. మరీ పొదుపరి చేయవద్దు. సరి అయిన వస్తువుకు సరి అయిన ధర చెల్లించేలా చేయాలి.
6. డబ్బు విలువ పిల్లాడికి బాగా చెప్పాలంటే తరచు వానితో చర్చించటమే. సంపాదించే ట్రిక్కులు నేర్పాలి. సరి అయిన మార్గంలో పొదుపు, దానిని వృద్ధి చేయటం నేర్పించాలి.



Click it and Unblock the Notifications