Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లలకు నేర్పవలసిన జీవిత పాఠాలు?

1. పెద్దలను గౌరవించడం - జీవిత పాఠాలకు వచ్చేసరికి ఇది చాలా ప్రధానమైన అంశం. పిల్లలకు పెద్దలను గౌరవించాలి అని నేర్పించడం వారి మంచి ప్రవర్తనకు దోవతీస్తుంది. మీరు నేర్పించిన దానినిబట్టే మీ పిల్లల ప్రవర్తన బహిర్గతమవుతుంది.
2. నిజాయతీ - నిజాయతీగా వుండటం ఉత్తమ జీవన విధానం అని మీకు తెలిసిందే. మీ బిడ్డకు ఈజీవిత పాఠం నేర్పితే, భవిష్యత్తులో అతను ఎంతో నేర్చుకుంటాడు. అతని వ్యక్తిగత, లేదా సామాజిక లేదా తన ఉద్యోగ జీవితంలో అతను ఎంతో నిజాయతీగా వుండి పైకి వస్తాడు.
3. విఫలతలు జీవితంలో ఒక భాగం - జీవితంలో ఎపుడో ఒకపుడు విఫలం చెందుతామనేది మీ బిడ్డకు నేర్పండి. పిల్లాడు విఫలమైతే, తల్లితండ్రులు వ్యధ చెందుతారు. విద్య, క్రీడలు లేదా ఇతర చర్యలలో మీ బిడ్డ విఫలమైతే, దానిని ఆమోదించండి. అందుకు కారణాలు అతనికి తెలుపండి. వారు విచారపడి కూర్చోకుండా మరో ప్రయత్నం చేసి గెలవాలని తెలుపండి. మానసికంగా బలపరచండి.
4. సానుభూతి - తమగురించే కాక ఇతరుల గురించి కూడా ఆలోచించటం నేర్పించండి. ఏదో ఒక నాటికి అతను కూడా చెడు దశలో పయనించాల్సివస్తుందనేది మరచిపోకండి. మీరు స్వార్ధంగా వుంటే, ఒంటరిగా వుండిపోతారని, ఇతరుల సహాయం కూడా కావాలని తెలుపండి. అది వారిని పెద్దవారైన తర్వాత ఇతరులకు సహాయపడేందుకు దోవతీస్తుంది.
5. పంచుకోవటం - తన వద్ద వున్న ఆహారం, బొమ్మలు మొదలైనవి పక్కన వున్నవారితో పంచుకోవాలని నేర్పించండి. సమాజంలో అతను చురుకైన వ్యక్తి అయి ఇతరులతో ఎలా కలసి పనిచేయాలనేది తెలుస్తుంది.
6. కష్టించి పనిచేయటం - పిల్లలలో సోమరితనం, పెద్ద అయినా సోమరిగానే వుంటారు. ప్రతి చిన్న అంశం వివరించంకండి. జీవితంలోప్రాధమికంగా తెలుసుకొని భాధ్యతలు నిర్వర్తించేలాచేయండి. దయ చూపటం మంచిదే. కాని అతిగా చూపే ప్రేమ, దయ పిల్లాడిని పాడు చేస్తాయి.
7. ప్రవర్తన - అతను నలుగురిలో వున్నపుడు అరవటం, సీన్ క్రియేట్ చేయటం వంటివి వుండరాదని, మర్యాద మన్ననలతో పక్కవారిని గౌరవిస్తూ ప్రవర్తించాలని తెలుపండి. ఈ అంశం అతని తల్లితండ్రులు అతనికి బాగా శిక్షణ నిచ్చినట్లు వెల్లడిచేస్తుంది.
బాల్య దశ ముచ్చటైనది. అదే సమయంలో తల్లితండ్రులు వారికి సమర్ధవంతంగా ప్రధాన జీవిత పాఠాలు నేర్పాలి.



Click it and Unblock the Notifications