Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
నిరంతరం కనిపెట్టాల్సిన పిల్లలు!
సాధారణంగా ఇంటిలో పిల్లలు ఉన్నారంటే, ఎదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. మనం వారికొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికి ఏదో ఒక సమయంలో మన అజాగ్రత్త కారణంగానో లేక బిడ్డ అల్లరి చేష్టలవలననో కొన్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. అందుకొరకు పెద్దలుగా మనం ఇంటిలోని పిల్లలకు ఎన్నో విషయాలు వివరిస్తూ ఉండాలి. అంతేకాక, వారిని నిరంతరం కనిపెట్టి కూడా ఉండాలి. మరి ఇంట్లో ఎదిగిన పిల్లలుంటే కొన్ని ప్రమాదాలు తప్పవు. అయితే పెద్దలు వీటిని గ్రహించి కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వాటిని నివారించవచ్చు. ఈ ముందస్తు జాగ్రత్తలు కొన్ని దిగువ పొందుపరుస్తున్నాం. పరిశీలించి ఆచరించండి.
1. ముక్కు నుండి రక్తం కారటం - పిల్లలకు ఉన్నట్టుండి ముక్కునుండి రక్తం కారతూ వుంటుంది. దీనిని అరికట్టాలంటే తలను కిందకు అదిమిపట్టి తలపై ఐస్ ముక్కనుంచి, ముక్కు మూసి నోటితో గాలి పీల్చుకోమనాలి. వెంటనే రక్తం కారటం తగ్గుతుంది.

2. పిల్లలు పడటం: పిల్లలు ఎత్తు ప్రదేశాలనుంచి పడ్డపుడు గాయాలౌతాయి. వీటికి సత్వర చికిత్సకు గాను ఇంటిలో ఐస్ ముక్కలుంచితే, వాటితో గాయమైన ప్రదేశంలో రుద్దితే తక్షణం రక్తం ఆగటమే కాక నొప్పి కూడా తగ్గుతుంది.
3. కాలిన గాయాలైతే - వంటగదిలో అటూ ఇటూ తిరుగుతూ వేడెక్కిన స్టవ్ లు, లేదా గిన్నెలు ముట్టుకుని గాయాలు చేసుకుంటారు. ఆ సమయంలో కాలిన గాయాలకు కాఫీపొడి లేదా పసుపు లేదా కిళ్ళీలలో వేసే కాసు వంటివి రాయవచ్చు. గాలి బాగా తగలాలి. తర్వాత వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళి గాయం ఎంత తీవ్రంగా అయిందనేది పరీక్షించి వైద్యం చేయించండి.
4. కుక్క లేదా పిల్లి వంటి పెంపుడు జంతువులు కరవటం -ఎంత పెంపుడు కుక్క అయినప్పటికి ఒప్పుడో ఒకప్పుడు పిల్లలను కరుస్తూ వుంటుంది. కరిచిన శరీర భాగాన్ని నీటితో బాగా అయిదారుసార్లు కడగండి. యాంటీ సెప్టిక్ లోషన్ రాసి వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళండి.
5. ఆహారం తినేటపుడు మింగలేక ఊపిరాడకపోతే - ఖంగారు పడవద్దు దగ్గరకు తీసుకుని పిల్లాడి తలను ముందుకు వంచి పొట్టకి రెండువేపులా రెండు చేతుల్ని ఉంచి, వీపు భాగంపై తట్టుతూ వుంటే లోపల ఇరుక్కున్న ఆహారం సర్దుకుంటుంది. ఈ సమయంలో పిల్లాడు నోటితో శ్వాస తీసుకునేలా చూడాలి.
ఈ రకమైన జాగ్రత్తలను ముందస్తుగానే తీసుకుని మీ పిల్లలను ప్రమాదాలబారినుండి సంరక్షించండి.



Click it and Unblock the Notifications