Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
స్నాక్స్ లో కూడా పోషకాలు అవసరమే?

పిల్లలు పెద్దవారయ్యే కొద్ది, వారికి చిరుతిండ్ల అవసరం తరచుగా ఉండదు. కాని స్కూల్ తర్వాత పిల్లలు సాధారణంగా ఆకలిగా ఉన్నట్లు భావిస్తారు. అందుకు కారణం వారు తమ లంచ్ ని షుమారుగా 11.30 లేదా 12 గంటలకే మధ్యాహ్నం వేళ తినేస్తారు. తర్వాత మధ్యాహ్న తరగతులు హాజరు కావటం చేస్తారు.
స్కూల్ నుండి బయటకు రాగానే వారిక అక్కడే ఎదురుగా వుండే చిరుతిండి ఆహారాలు బయట బండ్లపైన లేదా చిన్న దుకాణాలలో కనపడుతూంటాయి. అవి వారికంటికి ఎంతో ఇంపుగా కూడా ఉంటాయి. పిల్లవాడి వయసు ననుసరించి, అతని స్కూల్ రొటీన్ అననుసరించి తల్లితండ్రులు అతడు సాయంత్రం స్నాక్స్ ఏం తింటాడనేది నిర్ణయించాలి. అపుడే పిల్లవాడు, స్కూల్ తర్వాత తినే చిరుతిండ్లు అతడికి కడుపు నింపి తృప్తి కలిగించేవిగా ఉంటాయి. తర్వాత రాత్రికి డిన్నర్ కూడా చక్కగా తీసుకునేలా చేస్తాయి.
మీరు మీ పిల్లవాడి భావనలో ఆలోచించండి. సాధారణంగా వారంలో అతని తినే అలవాటు పరిశీలించండి. కొంతమంది చిన్న పిల్లలు, ఉదయం భోజనానికి ముందుకు కూడా స్నాక్స్ తింటారు. కాని పెద్ద పిల్లలు తినరు. వారు లంచ్ సమయం కొరకు చూస్తారు. మరి లంచ్ లో ఎంత వారు తింటారు? లంచ్ ఎపుడైనా మానేస్తారా? స్కూల్ ప్రొగ్రామ్ లలో స్నాక్స్ ఇస్తారా? ఈ రకమైన అంచనాలు, మీ పిల్లలు ఇంటికి వచ్చినపుడు ఎంత ఆకలిగా ఉన్నారనేది తెలుపుతాయి. అంతేకాదు, రాత్రి డిన్నర్ సాధారణంగా ఏ సమయంలో మీరు ఇస్తారనేది కూడా ఆలోచించండి. మూడున్నర గంటలకు ఇంటికి వచ్చి స్నాక్స్ తిన్న పిల్లవాడు 5.30 గంటల డిన్నర్ కు రెడీ కాలేడు. అదే విధంగా, లంచ్ తర్వాత ఏం తినకుండా పిల్లవాడు, కొంతమంది తల్లితండ్రులు తమ పనుల తర్వాత ఇచ్చే 7.30 గంటల డిన్నర్ వరకు వేచివుండలేడు. కనుక మీ పిల్లవాడి ఆహారాల ప్రణాళిక మేరకు ఏర్పాటు చేయండి.
ఆరోగ్యకరమైన తిండ్లు ఎంపిక చేయండి....!
స్నాక్స్ సమయంలో మీ పిల్లవాడు ఏ రకమైన ఆహారాలు తినటానికి ఇష్టపడతాడు. ఒక ఆరోగ్యకర తిండ్ల జాబితా తయారు చేయండి. వాటిలో తాజా పండ్లు, కూరగాయలు కూడా ఉంచండి. కేకు ముక్కలు, పొటాటో చిప్స్ వంటి తక్కువ పోషకాలు ప్రతిరోజూ స్కూల్ తర్వాత ఇవ్వకండి.
మీకు వీలుపడితే, మీ పిల్లవాడిని సమీపంలో ఉన్న కిరాణం షాపుకు తీసుకు వెళ్ళండి అక్కడ ఉన్న ఆహార పదార్ధాల ప్యాకెట్ల లేబుల్స్ పరిశీలించి అధికంగా పోషకాలు ఉండే అంటే తగినంత ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఇతర ప్రధాన పోషకాలు కలవి కొని ఇవ్వండి. షుగర్, కొవ్వు మరియు ఉప్పు తక్కువ వుండే చిరుతిండ్లు ఎంచుకోండి. పిల్లలు అందుబాటులో ఏ ఆహారం ఉంటే దానిని తినేస్తారు. కనుక మీరు వారి కొరకు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంపిక చేయండి. అవసరం అనుకుంటే వారు స్కూల్ నుండి వచ్చే సమయంలోనే వాటిని తీసి తినేలా వారి స్కూల్ బ్యాగ్ లలో కనపడేలా ఉంచండి.



Click it and Unblock the Notifications