Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టీనేజ్ పిల్లల నియంత్రణ ఎలా?

ఎట్టి పరిస్ధితిలోను మీరు అతనిపై నియంత్రణ కోల్పోకండి. మీకు వారు వ్యతిరేకం చెప్పినా లేక తప్పుగా ప్రవర్తించినా కోపగించవద్దు. వారు ఎపుడూ మీ మార్గదర్శకతలకై చూస్తూనే వుంటారు. వారిపై ఎంత కోపం వచ్చినా....ఆమె తప్పులు తెలిపేముందు, గాఢంగా శ్వాస పీల్చి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. అవసరమైందనుకుంటే, మీకు మరింత కోపం వచ్చేస్తే, మీ బిడ్డకు మీకు కొంచెం దూరం ఆచరించండి. మీ టీనేజ్ అబ్బాయి మరింత ప్రమాదకరమనుకుంటే తప్ప, మీరిచ్చే ఆదేశాలకు ముందు అతనితో పూర్తిగా అంశాన్ని చర్చించండి.
సమాజంలో కొన్ని చేష్టలు అంగీకారం కాదని వారికి తెలియజెప్పండి. కొన్ని విషయాలలో వారికి బయటివారి కౌన్సిలింగ్ కూడా అవసరమవుతుంది. అందుకు సహకరించండి. మీరు పాజిటివ్ గా ప్రవర్తించలేకపోతే పిల్లాడిని బయటివారి వద్దకు పంపి వారి మంచి ప్రవర్తనకై సలహాలనిప్పించండి. వారిపట్ల భాధ్యత నెరిగిన తల్లితండ్రులుగా వారికి కొన్ని విషయాలలో వద్దని చెపటం కూడా అవసరం. మీ పిల్లాడు దానిని వినేలాగా కూడా మీరు చేయాలి. కొంతమంది పిల్లలు కోపంగా చెపితే అసలు అంగీకరించరనేది కూడా గుర్తించండి. ఎన్నో నియమ నిబంధనలు పెడితే, చివరకు ఏదీ ఆచరించరు. అవసరమైన చోట కఠినంగా వుండండి. తల్లితండ్రులుగా పిల్లలను ప్రతి రోజూ గమనిస్తూండాల్సిందే. వారిని ప్రేమించే వారుగా వారికి కావలసిన ఉత్మమైనదేదో మీరు వారికి తెలియజెప్పి ఆచరించేలా చేయండి. చివరగా, వారి శారీరక, మానసిక కదలికలను బట్టి వారిని మీరు తప్పక అంచనా వేయటం కూడా చేయాలని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications