Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
తల్లి.. కుమార్తెలు ఎప్పటికి స్నేహితులేనా?
ప్రపంచంలోని కుమార్తెలంతా తమ తల్లి ప్రేమ ఏ మాత్రం స్వార్ధం లేనిదని, ఏ షరతులు లేకుండానే తల్లి నిరంతరం తమకు ప్రేమను అందిస్తుందని భావిస్తూ ఉంటారు. మీరు కనుక నీకు అత్యంత సన్నిహిత స్నేహితురాలు ఎవరని ఏ యువతిని అడిగినా,...నామమ్మీ యే ..అని ఠక్కున సమాధానం చెప్పేస్తుంది. మరి అసలు ప్రశ్న తల్లులు, కుమార్తెలు మంచి స్నేహితులు కాగలరా అనేదానికి చాలామందికి సీరియస్ గా సందేహాలు వచ్చేస్తాయి. వాటిని పరిశీలిద్దాం.

తండ్రి... కుమార్తెల సంబంధాల వలే, తల్లి కుమార్తెల సంబంధాలు ఎపుడూ సంతోషంగా ఉండవు. మీ కుమార్తెను మీరు అందరికంటే కూడా బాగా ప్రేమించవచ్చు. కాని మంచి స్నేహితులుగా అవటంలో మీకుగల అడ్డంకులేమిటి? అనేది పరిశీలించండి.
తల్లి, కుమార్తెలు మంచి స్నేహితులు ఎందుకు కాలేరు?
ఆమెకు ఇష్టమైన పేరెంట్ - తల్లి తండ్రులలో ఒకరు క్రమ శిక్షణ ఇచ్చేవారు మరొకరు స్నేహంగా ఉండేవారు. చాలా వరకు తల్లులు వారి కుమార్తెలకు క్రమశిక్షణ కఠినంగా ఇచ్చేలా ఉంటారు. తండ్రులు తమ కుమార్తెలంటే కొంచెం తేలికగా ఉంటారు. కనుక తల్లితో స్నేహంగా ఉండటమనే భావన కుమార్తెలకు కలుగక పోవచ్చు.
ప్రఖ్యాత మానసిక వేత్త సిగమండ్ ఫ్రాయిడ్ పురాతనకాలంలోనే తల్లి కుమార్తెల బంధం చెడుగా ఉంటుందని తెలిపాడు. అతని మేరకు కుమార్తెలకు పుట్టుకతో వచ్చే సహజ గుణంగా తల్లులంటే అసూయ ఉంటుందని తెలిపాడు. దీనికి కారణం కుమార్తె తనపై చూపించే తండ్రి ప్రేమలో తన తల్లి కొంత భాగం పొందటమేనంటాడు. ఈ అసూయ కనుక సాధారణ స్ధితి దాటితే, ఆ బిడ్డ ఎలెక్ట్రా కాంప్లెక్స్ అనే మానసిక బలహీనత పొందుతుంది.
ఒక తల్లిగా తల్లి తన కుమార్తెలు అధికంగా ఎల్లపుడూ కలిగించుకుంటుంది. ప్రతి తల్లితోను ఇదే సమస్య. మీ కుమార్తె కనుక మీకంటే భిన్నంగా ఉంటే మీరు నిరాశ చెందుతారు. అచ్చం తమవలెనే వుండాలని తల్లులు భావిస్తారు. మరి ఈ రకమైన ఒత్తిడి కూడా వారి మధ్య సంబంధాలను సరిగా సాగనివ్వదు.
తల్లి సహజగుణం - ఎవరైనా స్నేహితులు అవసరమైన దానికంటే కూడా అధికంగా ప్రేమ చూపితే, తల్లికంటే ఎక్కువ అంటారు. ఇక్కడ తల్లికంటే ఎక్కువ అనేది వ్యతిరేకంగానే వాడతారు. తల్లులు వాస్తవంగా మంచే చేస్తారు. మంచి సలహా ఇస్తారు. అది వారి విధి అని, జన్మ హక్కు అని భావిస్తారు. సహజమైన తల్లి గుణం కనుక ఉంటే వారు కుమార్తెలతో స్నేహితులుగా కూడా మెలగుతారు.
తల్లి కూల్ అయిపోతే - కుమార్తె పెరిగి పెద్దదవుతుంది. ఒక టీనేజర్ తర్వాత, మహిళ తర్వాత తల్లి అయిపోతుంది. ఇక తల్లి తన వయసు పట్ల సున్నితంగా అయవుతుంది. కుమార్తెకు 16 సంవత్సరాలు వస్తే చాలు, ఆమెతో కలసి నడవాలంటే తల్లి వెనుకాడుతుంది. కుమార్తెకన్నా అందంగా కనపడాలంటూ బ్యూటీపార్లర్ లేదా ఇతర అలంకరణలకు వెనుకాడదు. దుస్తులను సరి చూసుకుంటుంది. వార్డ్ రోబ్ మార్చేస్తుంది.
ఈ మార్పులు మీ కుమార్తె ఇష్టపడవచ్చు పడకపోవచ్చు. ఒక 16 సంవత్సరాల పిల్లకు వ్యక్తిగతంగా ఎన్నో అసౌకర్యాలు, ఆందోళనలు ఉంటాయని గ్రహించండి. ఆమెతో సహనంగా ఉండండి. పై అంశాలను కనుక మీరు గ్రహిస్తే, మీ తల్లి విధానాలను సరిచేసుకుంటూ మీ కుమార్తెతో స్నేహంగా ఉండండి. మరి మీ కుమార్తెకు ఒక ఫేవరెట్ పేరెంట్ గా తయారై ఏం జరుగుతుందో పరిశీలించండి.



Click it and Unblock the Notifications