Latest Updates
-
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి..
మలబద్ధకం సమస్య నివారించటం ఎలా?

చాలాసార్లు, తగినంత నీరు లేని ఆహారాలు తిన్నపుడు, మలబద్ధకం ఏర్పడుతుంది.తినే ఆహారంలో పీచులేనపుడు కూడా సమస్యగానే వుంటుంది. పీచు లేనందువలన తగినంత కదలికలు లేకుంటే, మలం బయటకు జారదు. పిల్లలు సాధారణంగా కొవ్వులు అధికంగా వుండే ఫాస్ట్ ఫుడ్స్ తింటారు (బర్జర్లు, పిజ్జాలు, మిల్క్ షేక్ లు, ఫ్రైలు )వీటిలో పీచు వుండదు. ప్రోసెస్ చేసిన కేండీలు, కుక్కీలు, కూల్ డ్రింక్ లు కూడా పీచు లేక హానికరంగా వుంటాయి. కొన్ని మార్లు పిల్లలలో ఐరన్ లోపం కొరకు వేసే మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి. పిల్లలు తల్లిపాలనుండి గేదె పాలకు మారేముందు లేదా ఒక ఆహారంనుండి మరో ఆహారంకు మారే సమయంలో కూడా పిల్లలకు మలబద్ధకం ఏర్పడుతుంది.
కొంతమంది పిల్లలు వారికి అవసరం వున్నా బాత్ రూమ్ కు వెళ్ళకుండా మానేస్తారు.ఆటలు ఆడుతూ, లేదా రెస్ట్ రూమ్ దూరంగా వుండి లేదా ఇతర కారణాలుగా వీరు బద్ధకిస్తూ వుంటారు. కనుక పెద్దవారు వీరిని తరచుగా అడుగుతూ బాత్ రూమ్ కు వెళ్ళమని చెప్పాలి. ఈ రకంగా అశ్రద్ధ చేస్తే, తర్వాతి దశలో మలం త్వరగా బయటకు రాదు. ఒత్తిడి కూడా మలబద్ధకాన్నిస్తుంది. స్కూల్, స్టడీస్ వంటి వాటితో వీరు ఒత్తిడి కలిగివుంటారు. కొవ్వు అధికంగా వుండే ఆహారాలు, మసాలా ఆహారాలు వీరిలో మలబద్ధకాన్ని కలిగిస్తాయి. కొన్ని సార్లు జబ్బుల కారణంగా లేదా మందుల కారణంగా కూడా పిల్లలకు మలబద్ధకం సమస్య వస్తుంది.
మలబద్ధక నివారణకు ఏం చేయాలి?
పిల్లలకు తగినంత ద్రవాహారాలు ఇవ్వండి.తగినంత నీరు తాగడం, ద్రవాహారాలు సమస్యను పరిష్కరిస్తాయి. పీచు అధికంగా వుండే ఆహారాలు, పండ్లు, కూరలు, గింజలు వంటివి తినిపించండి. తీపి వస్తువులు తినటం తగ్గించమనండి. పిల్లలతో తగినంత వ్యాయామం, ఆట పాటలు వంటి శారీరక శ్రమ కల్పించండి. ప్రతిరోజు ఆహారం నియమానుసారం ఒకవేళకు ఇవ్వండి. అన్నిటికి మించి పిల్లలకు మలవిసర్జనకు ప్రతిరోజూ ఒక సమయానికి వెళ్ళే అలవాటు చేయాలి. పిల్లలకు మలబద్ధక నివారణకు ఇచ్చే మందులు వైద్య సలహా మేరకే వాడండి.
ఈ చిన్నపాటి పరిష్కారాలు మీ పిల్లవాడిలో మలబద్ధకాన్ని పోగొట్టి ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications