Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వారిని బతకనివ్వండి...నేరాలను అరికట్టండి.

ప్రతి వెయ్యిమంది పురుషులకు 914 మంది మహిళలు మాత్రమే వున్నారనే గణాంకాలు చూసి విస్మయం చెందాలి. దేశానికి ఒక మహిళా ప్రెసిడెంట్, ఉన్నత పదవిలో మరో మహిళ. అంతరిక్షంలోకి వెళ్ళే సాహసవంతురాలు కల్పనా చావ్లా. అంతేకాదు తెల్లవారి లేస్తే ఆఫీసుల్లో పని చేసే వారిలో అధిక భాగం మహిళలు కూడా కనపడుతూంటారు. వివిధ రంగాలలో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా సంపాదనలు చేస్తున్నారు. అయినా....ఆడపిల్ల పుడుతోందంటే...సహించలేరు. ఎందుకీ పక్షపాతం. వారిపట్ల వివక్షత ప్రదర్శించటం.
మహిళ గర్భం ధరించిందంటే, పుట్టే బిడ్డ ఎవరు ? అనే ప్రశ్న తెచ్చుకోకండి. పిల్లలు భగవంతుడు ఇచ్చే బహుమానాలు. ఆడ పిల్ల పుట్టిందా? మీ బాగోగులు చూడటంలో ఆమె మీ తల్లికి సమానం. మగ బిడ్డ కలిగితే...అది కూడా ఆనందమే. ఇంటికి వారసుడంటారు. ప్రకృతి ప్రసాదించిన బిడ్డ ఎవరైనా కానీ సంరక్షించండి. వారి బాగోగులతో మీ ఆనందం పంచుకోండి. మనిషి భూమిపైకి వచ్చేటపుడు ఒక నోటితోనే కాదు రెండు చేతులతో కూడా జన్మిస్తాడనే వాస్తవం గ్రహించండి. ఆడ పిల్ల అంటే అబార్షన్ అనే అకృత్యానికి ఒక మనిషిగా పాల్పడకండి.



Click it and Unblock the Notifications