Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిన్న వయసులో ఏకాగ్రత నేర్పించండి!

1. ఆదర్శంగా వుండండి - మీరు ఏది చేస్తే పిల్లాడు దానినే చేయ ప్రయత్నిస్తాడు. కనుక వారిపై కేకలు పెట్టక, ప్రేమ, ఆప్యాయతలతో మీరు ఆదర్శంగా వుండి ఆ పనులు వానితో చేయించండి.
2. పరధ్యానం నివారించండి - పిల్లలు ఏదైనా చెప్పినపుడు టివి లాంటివి చూస్తూ పరధ్యానంలో వుంటారు. లేదా నటిస్తారు. మీరు సీరియస్ గా వుంటే తప్ప వారు మీరు చెప్పేదానిపై శ్రద్ధ పెట్టరు. కనుక తల్లితండ్రులుగా మీరు కొంత త్యాగం చేసి, టి.వి. ఇతర వినోదాలు ఇంటిలో కట్టిపెట్టి. పిల్లాడు తన పనిపై ఏకాగ్రత పెట్టేలా చూడండి. టైమ్ పాస్ టివి లకంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం చిన్నతనంనుండే అవసరం.
3. వారితో ఆడండి - మీకు సమయం వున్నపుడు వారితో కేరం బోర్డ్, చెస్ వంటివి ఆడండి. ఇవి తెలివిని పెంచే ఆటలు. స్విమ్మింగ్, ఎడ్వంచెర్ క్రీడలు కూడా వారిని చురుకుగా వుంచుతాయి.
4. శుభ్రత విషయంలో కఠినంగా - రోజుకు రెండుసార్లు బ్రషింగ్, చెప్పులు బయట వదలటం, డైనింగ్ లోనే తినటం వంటి వాటిలో కఠినంగా వుండి ఆరోగ్యకర అలవాట్లు నేర్పండి. శుభ్రంగా వుండటం నేర్చుకుంటే, అతనిలో కొత్త ఆలోచనలు కూడా పుట్టుకు వస్తాయి.
5. పిల్లాడు బొమ్మలను ఇల్లంతా విసిరాడు. అవన్నీ సర్దమని మీరు చెప్పండి. ఎంతకీ దానికి రెడీ అవకపోతే, 1, 2, 3 అని మూడు సంఖ్యలు లెక్కపెడతానని, మూడో సంఖ్య లెక్కపెట్టేలోపు అవన్ని సర్దేయాలని చెప్పి వారిలో ఏకాగ్రత తీసుకురండి.



Click it and Unblock the Notifications