Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
శరీర వేడిని నియంత్రించే హైపోధాలమస్!

ఆరోగ్యకరమైన పిల్లలలో జ్వరం వచ్చినా నసరే అదేమంత సీరియస్ గా వుండదనేది గుర్తించండి. టెంపరేచర్ మీ బిడ్డలో పెరిగిపోయినప్పటికి, ఒక్క జ్వరం అనేది మీ బిడ్డకు ఏ హాని కలిగించదని గుర్తించండి. బిడ్డకు జ్వరం రావటం మంచిదని కూడా తెలుసుకోండి. మనలో వున్న వ్యాధులను ఎదుర్కొనటానికి శరీరం చేసే చర్యగా భావించండి. అన్ని జ్వరాలకు చికిత్స అవసరం లేదు. జ్వరం అధికంగా వుంటే బిడ్డకు అసౌకర్యంగా వుంటుంది. డీ హైడ్రేషన్ వంటి సమస్యలు కలుగుతూంటాయి.
జ్వరం వస్తే ఏం చేయాలి? దానిని ఎలా కొలవాలి? ఎలా చికిత్స చేయాలి, డాక్టర్ ను ఎపుడు సంప్రదించాలి అనే వాటికి సమాధానాలు చూడండి.
జ్వరం గురించిన కొన్ని వాస్తవాలు....
జ్వరం అనేది శరీర అంతర్గత ధెర్మోస్టాట్ పెరిగినపుడు వస్తుంది అది శరీర ఉష్ణోగ్రత సాధారణ స్ధాయికంటే పెంచుతుంది. ఈ ధెర్మోస్టాట్ అనేది బ్రెయిన్ లో ఒక భాగంగా వుంటుంది. దీనినే మనం హైపోధాలమస్ అని కూడా అంటాము. హైపోధాలమస్ కు మీ శరీరం ఎంత ఉష్ణోగ్రతలో వుండాలి అనేది తెలుసు. సాధారణంగా అది 98.6 ఫారెన్ హీట్ డిగ్రీలు లేదా 37 సెల్సియస్ డిగ్రీలుగా వుంటుంది. అది మీ శరీరానికి ఆ స్ధాయి ఉష్ణోగ్రత వుండాలని తెలియజేస్తుంది.
చాలామందికి రోజు దినచర్యలో శరీర టెంపరేచర్ పెరుగుతూ వుంటుంది. ఉదయం సాధారణంగా తక్కువగాను, సాయంత్రం అయ్యేసరికి కొంచెం అధికంగాను వుంటుంది. పిల్లలు పరుగుపెట్టటం, ఆడటం, వ్యాయామం చేయటం వంటివి చేస్తే అది పెరగటం, తగ్గటం జరుగుతుంది.
కొన్ని సార్లు అంటే ఏదైనా జబ్బు చేసినపుడు లేదా మార్పు కలిగినపుడు, ఇన్ ఫెక్షన్ కలిగినపుడు హైపోధాలమస్ శరీరాన్ని కొత్తగా అధిక ఉష్ణోగ్రత వద్ద పెడుతుంది. ఈ రకంగా వేడి పుట్టించటం మనలోని క్రిములను ఎదుర్కొనేటందుకుగాను జరుగుతుందని, మన శరీరం లో చేరిన క్రిములకు శరీరం సౌకర్యవంతమైన ప్రదేశం కాకుండా చేసేందుకే ఈ రకంగా హైపోధాలమస్ చేస్తుందని రీసెర్చర్లు చెపుతారు.



Click it and Unblock the Notifications