Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తాడుపై గెంతుతా....జీవితంలో ఎదుగుతా!

2010 సంవత్సరంలో సైన్స్ డైటీ నిర్వహించిన ఒక రీసెర్చిలో పిల్లలకు 9 నుండి 10 సంవత్సరాల వయసులో శారీరక ఫిట్ నెస్ కు బ్రెయిన్ కు మధ్య గాఢమైన సంబంధం ఉందని తేలింది. శారీరకంగా బలంగా ఉన్న పిల్లలు, వారి చదువుల్లో బాగా ముందుంటారట. శారీరక ఆరోగ్యం అంతంత మాత్రం అయితే, చదువుకూడా అంతేనట. చదువులే కాదు, మీ పిల్లవాడు తాను ఆడే ఆటలు, క్రీడలలో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటాడు. బహుశ ఏదో ఒకనాటికి వారు ప్రపంచ ఛాంపియన్ లు కూడా కావచ్చు. కనుక పిల్లవాడి మైండ్ మరియు శరీరానికి పనికివచ్చే వ్యాయామాలు తప్పక చేయించండి.
మరి పిల్లలకు ప్రతిరోజూ ఏ రకమైన వ్యాయామాలు బాగుంటాయి?
1. బార్ వ్రేలాట - పిల్లలు హారిజంటల్ బార్ పై తమ స్నేహితులను చూసి అదే విధంగా చేయాలని కూడా ప్రయత్నిస్తారు. ఇది వారి చేతులు, భుజాలు బలపరుస్తుంది.
2. అదే విధంగా అతని భుజాలకు, వెన్నుకు సంబంధించిన కొన్ని అరబిక్ వ్యాయామాలు చేయిస్తే, పుస్తకాల సంచులు మోసేందుకు తేలికగా కూడా ఉంటుంది.
3. స్కిప్పింగ్ - చిన్నవయసులోనే స్కిప్పింగ్ రోప్ ఆట ఆడిస్తే వారికి ఎంతో మంచిది. దీనితో పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది.
4. స్పాట్ రన్నింగ్ - ఒకే చోట నిలబడి వేగంగా పరుగెత్తించండి. చెవులకు ఆహ్లాదంగా మ్యూజిక్ పెట్టండి. నిద్ర లేవగానే ఈ రపని చేయిస్తే, చాలా మంచిది. ప్రతిరోజూ పది నిమిషాలు ఈర స్పాట్ రన్నింగ్ చేస్తే బిడ్డకు ఎంతో ఎనర్జీ వస్తుంది.
5. ఒంటికాలి గెంతుడు - సాధారణంగా పిల్లలు నేలపై గడి గీసి ఒంటి కాలితో గెంతి ఆడతారు. ఈ ఆట వీరికి ఎంతో శారీరక బలం ఇస్తుంది.
కనుక పిల్లలకు ఆనందంగా ఉండాలంటే, చిన్నపుడే, ఆటలు, క్రీడల వంటివి నేర్పించి వారు వాటిని ఆడేలా చేయండి. అదే వారికి శారీరక వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. శారీరకంగానే కాక వారు మానసికంగా ఎంతో ఫిట్ అయి చదువులలో ముందుంటారు.



Click it and Unblock the Notifications