Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎదిగే పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి...?

కాబట్టి పిల్లలు ఎత్తు బాగా పెరగాలంటే పుట్టుకతోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాలు పిల్లలను ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి. బిడ్డకు తొమ్మిది నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, ఫ్యాట్, క్యాల్షియం, ఐరన్, బి-విటమిన్, జింక్, పిండి పదార్థాలు సమతూకంలో ఉండేలా జాగ్రత్తపడాలి. తృణధాన్యాలు, పాలు, చేపలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, నట్స్‌లో ఇవన్నీ లభిస్తాయి. భోజనానికి భోజనానికి మధ్య ఆకలి పుట్టేంత గ్యాప్ ఇవ్వాలి. మోతాదు ను మించిన ఆహారం తీసుకుంటే లావు అవుతారు తప్ప, ఎత్తు పెరగరు.
మార్కెట్లో దొరికే బూస్టర్లు తాగిస్తేనే ఎత్తు పెరుగుతారనుకోకూడదు. విటమిన్లు, న్యూట్రియంట్లు ఆహారంలో సమతూకంలో ఉండేలా జాగ్రత్తపడితే పిల్లల వయసు పదిహడేళ్లు వచ్చేవరకు తగినంత ఎత్తు పెరుగుతారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ఇవ్వాలో చూడండి....
బ్రేక్ ఫాస్ట్ : గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ జామ్ తో పాలు. గ్లాసుపాలు, ఉడకబెట్టిన గుడ్డు. పాలు, చీజ్ శాండివిచ్, ఉప్మా, ఇడ్లీతో పాటు గ్లాసు పాలు.
షార్ట్ బ్రేక్ సమయంలో ఫ్రూట్ సలాడ్ లేదా పళ్ళ ముక్కలు
మధ్యాహ్నం లంచ్ లో పరోటాలు లేదా చపాతీలతో పాటు కూరా లేదా పప్పు తప్పనిసరిగా ఉండాలి. అన్నం, పప్పు, కూరతో గడ్డ పెరుగు.
సాయంత్రం సమయంలో అరటిపండు షేక్, ఇంట్లో తయారు చేసిన కప్పు పాప్ కార్న్, బాదం, జీడిపప్పు, లాంటి నట్స్,
రాత్రి డిన్నర్ సమయంలో మధ్యాహనం ఇచ్చిన మెనూనే కొద్దిగా మార్చికూడా ఇవ్వొచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.



Click it and Unblock the Notifications