Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల కంటి చూపు పరీక్షలు ఎలా?

పిల్లల కండ్ల చికిత్సలకుగాను వివిధ రకాల కంటి డాక్టర్లు వుంటారు. కంటిడాక్టర్ల పేర్లు కొంతమేర మనకు అవగాహన కలిగించనప్పటికి, పిల్లల విషయంలో ప్రాధమిక చికిత్సకు గాను తగిన కనీస సౌకర్యాల వైద్యుని సంప్రదిస్తే సరిపోతుంది. కంటి వైద్యులను ఆఫ్తాల్మజిస్టులు అంటారు. వీరు సమగ్ర కంటి సంబంధిత వైద్యానికి, సర్జరీకి బాగా ఉపయోగపడతారు. వీరినే పిల్లల కంటి వైద్యులు అని కూడా అంటారు. పిల్లల కళ్ళ చికిత్సకుగాను వీరికి ప్రత్యేక శిక్షణకూడా ఇస్తారు. కంటి వైద్యులలో ఆప్టోమెట్రిస్టులని వుంటారు. వీరుకూడా ఆఫ్తాల్మజిస్టులవలెనే వైద్యం అందిస్తారు. ఆప్టిషియన్లు అనేవారు కంటి గ్లాసులను మాత్రమే ఫిట్ చేసి కంటి జోళ్ళను అందిస్తారు.
కంటి పరీక్షలు - పిల్లల కంటి పరీక్షలలో సాధారణంగా వుండే అంశాలు పరిశీలించండి. కొత్తగా పుట్టిన బిడ్డలకు సాధారణంగా కంటి చూపును కుటుంబ వైద్యుడు లేదా పేడియాట్రిషియన్ హాస్పిటలో లో పరిశీలిస్తారు. రిస్కుతో కూడిన పుటుక కల పిల్లలకు ( పసికందులవంటివారికి), లేదా కంటి సమస్యలకు కుటుంబ చరిత్ర వున్నవారికి కంటి వైద్యులచే ప్రత్యేకంగా పరీక్ష చేయించాలి. బిడ్డకు మొదటి సంవత్సరంలో, పిల్లల వైద్యులు లేదా కుటుంబ వైద్యులచే శిశువులకు రొటీన్ కంటి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. మూడున్నర సంవత్సరాలు వచ్చేటప్పటికి, పిల్లలు, మరోమారు కంటి ఆరోగ్య పరీక్షలను చేయించాలి. ఈ సమయంలో వీరికి దృష్టి తీవ్రత కొరకు పరీక్షలు చేయించాలి.
పిల్లలకు 5 సంవత్సరాల వయసులో మరోమారు కంటి మరియు దృష్టి పరీక్షలను తగిన వైద్యులచే చేయించాలి. ఈ పరీక్షలలో విఫలమైతే మరోమారు ఫ్యామిలీ డాక్టర్ లేదా పిల్లల వైద్యులచే పరీక్ష చేయించాలి. 5 సంవత్సరాల వయసు తర్వాత స్కూలులో లేదా డాక్టర్ల ఆస్పత్రిలో లేదా వారి కంటికి మెల్ల లేదా తరచు తలనొప్పి రావటం వంటివి వస్తూవుంటే పరీక్షించాలి. ఈ సమయంలో టీచర్లు కూడా వీరి దృష్టి దోషాలను కనిపెట్టగలరు. తరగతి గదిలో చదివేటపుడు లేదా వ్రాసేటపుడు పిల్లవాడు సరిగా చదవటం, వ్రాయటం వంటివి వీరు గమనిస్తారు. తరగతి గది చదువునాటికి వైద్యుల సలహాచే కంటి గ్లాసులు ధరించిన పిల్లలు తమ దృష్టి మార్పులకై ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలి.



Click it and Unblock the Notifications