Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దటమెలా?

ముఖ్యంగా మూడేళ్ల వయస్సులో పిల్లల్ని తరచుగా కొడుతుంటే ఎదిగేకొద్దీ వారిలో దురుసు ప్రవర్తన ప్రబలుతుంది. మొండితనం అధికమవుతుంది. మరీ చిన్నతనంలో కనుక పిల్లల్ని కొట్టినట్లయితే వారికి మూడేళ్ల వయస్సు వచ్చేసరికి దెబ్బలు తినని పిల్లలతో పోల్చితే జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశం కూడా వుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
అయితే దురుసుగా వ్యవహరించే పిల్లలంతా చిన్నతనంలో ఏదో ఒక సందర్భంలో బాగా దెబ్బలు తిన్నవారేనని అంచనా వేయకూడదు. దురుసుతనానికి ఇదో కారణం. హింసాత్మక ధోరణితో వ్యవహరించడాన్ని తాము తిన్న దెబ్బలు ప్రభావితం చేస్తాయన్నది పిల్లల నిపుణుల అభిప్రాయం.
ఎంత విసిగించినా చెయ్యి ఎత్త వద్దని ఆంక్షలు పెట్టుకోవడం ఆచరణలో కొంచెం కష్టమే కానీ, వీలైనంతవరకు నియత్రణ చేసుకోవడమే మంచిది. లేకుంటే పిల్లలు ప్రేమపూర్వకమైన తల్లితండ్రుల పట్ల అయిష్టాన్ని పెంచుకొని మరింత దురుసుగా ప్రవర్తించటమేకాక, తమ తమ కెరీర్లు సైతం పాడుచేసుకునే అవకాశాలున్నాయి.



Click it and Unblock the Notifications