Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బిడ్డను బడికి తయారు చేయడం ఎలా?

మీ బిడ్డను స్కూలుకు తయారు చేసేందుకు కొన్ని చిట్కాలు.
పిల్లవాడితో అబద్ధం చెప్పకండి - ఏదో మాయమాటలు చెప్పి స్కూలువరకు తీసుకెళ్ళి లోపల వదిలేద్దాం అనుకోకండి. అది చాలా తప్పు. మొదటి సారి స్కూలుకు వెళ్ళడం అతనికి భయంతో కూడిన ఒక అనుభవం. అతనికి మానసిక సంసిద్ధత కావాలి. అందుకని వాస్తవం చెప్పండి.
పెద్ద మార్పు - మీ బిడ్డ స్కూలుకు వెళ్ళటం మొదలుపెట్టాడంటే అది అతని జీవితంలో పెద్ద మార్పు తెస్తుందని గ్రహించండి. తర్వాతిదశలో ప్రైమరీ స్కూలు, హైస్కూలు, కాలేజి, తర్వాత ఉద్యోగం అతను చేయాలి. ఎంతో హాయిగా వున్న తన శిశువు దశను అతను కోల్పోతున్నాడు. ముందుగా ఈ పరిస్ధితి మీరు అర్ధం చేసుకుంటే, బిడ్డకు నచ్చ చెప్పవచ్చు.
మీ మొదటి రోజు - మీరు స్కూలులో అడుగు పెట్టిన రోజు గుర్తు తెచ్చుకోండి. అపుడు మీరు అతనికి ఎలా తెలియజెప్పాలనేది గ్రహించగలరు.
మీరు గట్టిగా కూడా వుండాలి - పిల్లవాడు ఏడిస్తే మీరు కరిగిపోయి బడి మానిపించరాదు. అది వాడికి ఏ మాత్రం ప్రయోజనం కాదు. కనుక మీరు గట్టిగా వుండి బేబీ ఏడ్చినా సరే స్కూలుకు పంపేలా వుండాలి. అది అతని ప్రయోజనం కొరకు అని గ్రహించండి.
స్కూలు ప్రయోజనాలు - బిడ్డ స్కూలుకు వెళితే, అతను స్నేహితులను కలవవచ్చని, మంచి యూనిఫారం వేసుకోవచ్చని ఇంకా ఆసక్తి కలిగించే పనులు చేయవచ్చని వివరించండి. స్కూలు ఒక శిక్ష కాదని, జీవితంలో కొత్త అంశాలకు మార్గమని తెలుపండి. అతనికిష్టమైన ఆంటీ ఇంటికి వెళ్ళినట్లు అక్కడ మమ్మీ, డ్యాడీ వుండరని తెలుపండి.
ఈ చిట్కాలు ఉపయోగించి తల్లితండ్రులు తమ పిల్లలను స్కూలుకు తేలికగా పంపవచ్చు.



Click it and Unblock the Notifications