Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పిల్లలలో ఆరోగ్యాభిలాష పెంచటమెలా?

పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి నెలకొల్పండి. అపుడపుడూ పిల్లలు కూడా వివిధ క్రీడలగురించి వివరాలు అడుగుతుంటారు. వాటిని సేకరించి వాటిలోని నైపుణ్యతను వారు గ్రహించేలా చేయండి. అందుకు అనువైన పరిస్ధితులు నెలకొల్పండి. తగిన సమయాన్ని క్రీడలకు వెచ్చించమనండి. ఆరోగ్యంగా వుండటమనే అంశంపై వారి భావనలు కొనసాగేలా చూడండి. వారి ఆలోచనా ధోరణి ఆ మార్గంలో వుండాలి. ఆరోగ్యానికి ప్రాముఖ్యత నివ్వాలి. సాధారణంగా పిల్లలు, తమ పెద్దలను అనుసరిస్తారు. కనుక తల్లితండ్రులు ముందుగా మారాలి.
క్రీడలతోపాటుగా మంచి ఆహారం, ఇతర వ్యాయామాలు కూడా వారిలో చురుకును, ఉత్సాహాన్ని నింపుతాయి. తల్లితండ్రులు పిల్లలలో వ్యక్తిత్వాన్ని నింపాలి. వారి మెదడుతో వారిని స్వతంత్రంగా ఆలోచించేలా చేయండి. ప్రేమ అధికంగా చూపి వారికి ప్రతి విషయం స్పూన్ ఫీడ్ చేయవద్దు.
ఎదిగే వారి శరీరానికి అవసరమైన కాల్షియం ఇవ్వండి. తగినంత నీరు, పీచు పదార్ధాలు, విటమిన్లు, మినరల్స్ కూడా అవసరమే. ఈ రకమైన ఆహారం వారిలో వ్యాధి నిరోధకత పెంపొందిస్తుంది. మీరు పిల్లలకు చెప్పేది మీరు ఆచరించండి. మంచి ఆహారపుటలవాట్లు కుటుంబ సభ్యులందరకు వర్తిస్తాయి.



Click it and Unblock the Notifications