Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
పిల్లల ఒత్తిడి తగ్గించడమెలా?

పిల్లలకు ఒత్తిడి కలిగించే అంశాలు
ఒత్తిడి అంటే అది మనపై కొన్ని డిమాండ్లు పెట్టి వాటిని నెరవేర్చే శక్తి మనకుండాలని పరీక్షిస్తుంది. ఈ డిమాండ్లు సాధారణంగా బయటనుండే అంటే, కుటుంబం, ఉద్యోగం, స్నేహితులు లేదా స్కూలు వంటి వాటినుండి వస్తాయి. అంతేకాదు మనలోనుండి కూడా పుట్టుకువస్తాయి. మన ఆలోచన, మనం చేయగలిగిన పనులు నుండి కూడా ఒత్తిడి కలుగుతుంది. కనుక ఒత్తిడి అనేది ఎవరైతే ఆందోళన చెంది అన్నీ చేయాలనుకుంటారో వారికి వుంటుంది. వారు పిల్లలైనా సరే. పిల్లలు పెద్ద వారయ్యేటప్పటికి విద్యాపర మరియు సామాజిక అంటే వారు సమాజంలో సర్దుబాటు చేసుకోవడం వంటి వాటిలో ఒత్తిడి వస్తుంది.
చాలామంది పిల్లలు స్కూలు నుండి వచ్చి చక్కటి ఆలోచన చేయటానికి లేదా ఆటలు ఆడటానికి కూడా ఎంతో బిజీగా వుండిపోతారు. అటువంటి పిల్లలతో మీరు మాట్లాడాలి. వారి బయటి చర్యలగురించి ఏమని భావిస్తున్నారో తెలుసుకోవాలి. వారు ఫిర్యాదులు చేస్తే, వారు నిలుపు చేసే చర్యలకు పూర్వాపరాలు చర్చించాలి. అది ఆపటం సరికాదనుకుంటే మీరు మీ పిల్లవాడి సమయాన్ని ఆందోళన లేకుండా ఆ పనులు చేయటానికి సహకరించండి.
పిల్లల ఒత్తిడి వారి జీవితాలలో జరిగేదానికంటే పెరిగిపోతూంటుంది. మీ పిల్లలు తమ పనిలోని కష్టాలగురించి మాట్లాడుతూంటే, లేదా బంధువు జబ్బు గురించి చెపుతూంటే లేదా మీ భార్యతో ఆర్ధిక విషయాలు మాట్లాడితే, వరు వాటిని ఎలా చర్చిస్తున్నారనేది తెలుసుకోవాలి. పిల్లలు అక్కడ వున్నపుడు ఆందోళన కలిగించే అంశాలు తల్లితండ్రులు చర్చించరాదు.
ప్రతిరోజూ టి.వి.లలో వచ్చే వార్తలు కూడా పిల్లలకు ఒత్తిడి కలిగిస్తాయి. అందులో కనపడే ప్రకృతి భీభత్సాలు, యుద్ధాలు, ఉగ్రవాదం, మొదలైనవి వారి స్వంత భద్రత గురించి ఆలోచింపజేస్తాయి. పిల్లలు చూసే అంశాలపై మీరు చర్చించండి. వారు టి.వి.లలో చూసే అంశాలు వారికి వివరించండి. దానితో వారు అసలు ఏం జరుగుతోందనేది తెలుసుకొని ఒత్తిడి తగ్గించుకుంటారు.



Click it and Unblock the Notifications