Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లలముందు తగవులు మంచిదా?

మన పిల్లలు మనలనుండి ఎంతో నేర్చుకుంటారనేది గ్రహించండి. మనం వారికి బోధించనవసరంలేదు. మనలను గమనిస్తూనే నేర్చుకుంటారు. పెద్దలుగా ఎలా సంభాషించాలనేది తెలుసుకోవాలి. మన పని ప్రదేశంలో, స్నేహితులతో, మన భాగస్వామితో, మన పిల్లలతో ఇంకా చెప్పాలంటే ప్రపంచంతో ఎలా మెలగాలనేది ప్రధానం. తగవులతో పరిష్కరించగలిగింది ఏదీ లేదు. తగాదాలోని భాగస్వాములిరువురూ చివరకు గాయపడేవారే. పిల్లలకు పెద్దలు మార్గదర్శకంగా వుండాలి. పిల్లల సమస్యల పరిష్కారానికి పెద్దల ఆచరణ ఒక పనిముట్టు వంటిది. మీకు మీ భాగస్వామికి సమస్య వుంటేపిల్లలముందైనా సరే పరిష్కరించుకోండి. అదీ చర్చలతో. చర్చలైన తర్వాత మీ అంశం పరిష్కరించబడాలి. అంతేకానీ ఎవరూ అందులో గాయపడరాదు.
అంశానికి సూచించే పరిష్కారం కూడా ఇద్దరకు సంతోషకరంగా వుండాలి. చర్చ కుటుంబ సమస్య అయితే, బహుశ పిల్లలు కూడా పాల్గొనవచ్చు. కోపం ప్రదర్శించకుండా ఎలా పరిష్కరించుకోవచ్చో వారికి తెలుపవచ్చు. కొంతమంది ప్రపంచం అంతం అయిపోయేట్లుగా లేదా వారి ప్రాణాలపైకి వచ్చేసినంతగా ఒక చిన్న అంశాన్ని పట్టుకునే తగవులు చేస్తారు. ఆ తగాదాలో వారు ఓడిపోతే అంతా సర్వనాశనంగా భావిస్తారు. కనుక, ప్రశాంతంగా వుండండి. రిలాక్స్ అయి మీ సమస్య పరిష్కరించుకోండి. హింస లేకుండా ఎలా పరిష్కరించుకోవచ్చో పిల్లలకు నేర్పండి. మన పిల్లలకు సమస్యల పరిష్కారం ఎలా అనేది తెనలియాలి. తల్లితండ్రులుగా వారిని భాధ్యతాయుత పెద్దలుగా చేయటం మన కర్తవ్యం. అందుకుగాను భాధ్యతాయుత పెద్దల గుణాలను ప్రదర్శించాలి.



Click it and Unblock the Notifications