Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
పిల్లలకు శిక్షణనివ్వటం తేలికే!

1. క్రమశిక్షణ ప్రాముఖ్యత - జీవితంలో క్రమశిక్షణగా వుండటం ఎంత ప్రాముఖ్యమనేది మీ పిల్లలకు వివరించండి. ఇక్కడ క్రమశిక్షణ అంటే పిల్లాడికి సంబంధించి మాత్రమే. అతనికిగల హద్దులు వివరించాలి. చెడు ప్రవర్తన సరిచేసుకోవాలి. వారికి హద్దులు పెట్టండి. చిన్నారుల మైండ్ కు శిక్షణగా కొన్ని ఉదాహరణలు చూపండి.
2. నిజాయతీ - పిల్లలకు నిజాయితీగా వుండటమనేది నేర్పించటం తేలిక పని కాదు. చాలాసహనం వుండాలి, భాధ్యత వుండాలి. పిల్లలు వారి తోటివారితో కలిస్తే ఎంత నిజాయతీగా వుంటారనేది కూడా గమనించాలి. కాని, నిజాయతీని పిల్లవాడిని నేర్పించటం మీ భాధ్యత. తనకు తాను నిజాయతీగా వుండటం, ఇతరులకు తాను నిజాయతీగా గూడా వుండటం నేర్పించాలి. వారిని అలా తయారు చేయాలంటే ముందు మీరు వారికి నిజాయతీగా కనపడాలి. మీ బిడ్డ వద్ద అబద్ధం చెప్పకండి అతను చెప్పినా సమర్ధించకండి.
3. భాధ్యతాయుతంగా - పిల్లలు ఎల్లపుడూ తమ వంతు సహకారం ఇవ్వడానికే చూస్తారు. ముందు తల్లితండ్రులకు సహకరిస్తారు. తండ్రికి షూస్ తెచ్చి ఇవ్వడం, తల్లికి కిచెన్ లో సహకరించటం వంటివి. మీరు వారిని ప్రోత్సహించాలి. అతను సరిగా ఆపని చేయలేకపోయినా, మీరు నిరుత్సాహ పరచవద్దు. నిరుత్సాహ పరిస్తే వారు భాధ్యతలేక తయారవుతారు. కనుక వారిని జోక్యం చేసుకోనివ్వండి. నేర్చుకునేలా చేయండి.
4. ఇతరులను గౌరవించటం నేర్పండి - మీ ప్రవర్తననుండే పిల్లవాడు నేర్చుకుంటాడు. కనుక మీరు మీ ప్రవర్తనలో గౌరవిస్తే, వాడు కూడా అదే రకంగా పెద్దలను, ఇతరులను గౌరవిస్తాడు. పిల్లాడు ఇంటిలోని వారిని గౌరవించకపోతే, బయటకూడా గౌరవం చూపడు. పెద్దలనే కాదు మీరు పిల్లలను కూడా గౌరవించాలి. ఇది వారిని సవ్యమైన మార్గంలో నడిపిస్తుంది.
5. ప్రేమించండి - మీరు అతనిని ప్రేమిస్తున్నట్లు తెలియజేయండి. శిక్షణలో ఇది ప్రధాన భాగం. వారు మీ కుటుంబానికి ఎంత ప్రధానమో తెలియజెప్పండి. పిల్లలకు మీరు వారిని ఎంత ప్రేమిస్తున్నారనేది తెలియాలి. ఒక చిన్న ముద్దు, కౌగిలి వంటివి మీ మధ్య గల వ్యత్యాసాలు తీర్చేస్తాయి.
పిల్లవాడికి ప్రాధమిక విలువలు నేర్పించటం పెద్ద కష్టం కాదు. చిన్నతనం నుండే నేర్పించాలి. మీ పిల్లవాడు భవిష్యత్తులో ఒక ఆదర్శ వ్యక్తిగా వుండేందుకు ఈ చిట్కాలు దోహదం చేస్తాయి.



Click it and Unblock the Notifications