Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పిల్లలు వారి ట్యూషన్ చదువులు!

పిల్లల చదువు విషయంలో తల్లితండ్రులు చేయాల్సినవి పరిశీలించండి. పిల్లల టీచర్లను బాగా తెలుసుకోండి. స్కూలులోని పేరెంట్ -టీచర్ సమావేశాలకు హాజరుకండి. హోంవర్కు విధానాలు వాటిలో మీరు ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అనేది తెలుసుకోండి. హోం వర్కు చేయటానికి అనువైన ప్రదేశం పిల్లలకు ఏర్పరచండి. పిల్లలు బాగా వెలుగువున్న ప్రదేశంలో చదివేలా చేయండి. వారికవసరమైన పేపర్లు, పెన్సిళ్ళు, జిగురు, కత్తెరలు వారికి అందుబాటులో వుంచండి.
ఇంటివద్ద చదివే ప్రణాళిక తయారు చేయండి. పిల్లలు తయారు చేసే ప్రణాళికకు మీరు సహకరించండి. హోం వర్కు ఎక్కువగా వుంటే దానిని కొన్ని సార్లుగా చేయించండి. అవసరమనుకుంటే రాత్రి వేళ కూడా చేయించండి. వారికి ఏ రకమైన ఆటంకాలు లేకుండా చూడండి. అంటే టి.వి. పెద్దగా పెట్టటం వంటివి వుండరాదు. ఫోన్ కాల్స్, మ్యూజిక్ వంటివి ఆ సమయంలో లేకుండా చూడండి. పిల్లలు వారి హోం వర్కు స్వంతంగా చేసుకునేలా చూడండి. సూచనలు మీరు ఇవ్వండి. అది పిల్లల పని కనుక వారే చేసుకోవాలి. మీరు వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. పరీక్షలు పెట్టాలి. చేసిన హోం వర్కు పరిశీలించండి. ఖర్చులు, ఇతర విషయాలలో మీరు వారికి ఆదర్శంగా వుండాలి. మీరు పుస్తకం చదివితే, పిల్లలు కూడా పుస్తకం చదవటం నేర్చుకుంటారని గ్రహించండి. సలహాలకంటే కూడా పిల్లలకు ఆచరణ ఉత్తమమైనది. హోం వర్కు అధికంగా వుండి పిల్లలు చేయలేకుంటే, సమస్యగా వుంటే, టీచర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించండి. కొంతమంది పిల్లలకు స్కూలులో బోర్డు చూడటం వంటి సమస్యలుంటే, కళ్ళ అద్దాలు అవసరమా? అని పరిశీలించి వారికి ఏర్పరచండి.



Click it and Unblock the Notifications
